/rtv/media/media_files/2025/10/30/azaharuddeen-2025-10-30-18-30-29.jpg)
మంత్రిగా రేపు అజారుద్దీన్(mohammad-azharuddin) ప్రమాణ స్వీకారం చేయడానికి రాజ్ భవన్(Raj Bhavan) లో ఏర్పాట్లు జరుగుతుంటే.. మరో వైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. ఇప్పటికే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై ఎన్నికల సంఘానికి బీజేపీ, బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై ఎలా ముందుకు వెళ్లాలో స్పష్టత ఇవ్వాలని ఈసీని సీఈఓ కోరారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
♦ టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్ భవన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.#Azharuddin#TelanganaPoliticspic.twitter.com/pl24eKLlV4
— AIR News Hyderabad (@airnews_hyd) October 30, 2025
Also Read : రేపు తెలంగాణ కేబినేట్ విస్తరణ.. కొత్త మంత్రలు ఎవరంటే?
జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే?
ఓ వైపు జూబ్లీహిల్స్ ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. రేవంత్ సర్కార్ మంత్రివర్గ విస్తరణ చేపట్టడం ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ లో దాదాపు లక్ష మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. వారి ఓట్లను ఆకర్షించడం కోసమే ఆ వర్గానికి చెందిన అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం నిబంధనలకు వ్యతిరేకమని వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. మరో వైపు రేపు మధ్యాహ్నం 12.15 నిమిషాలకు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఆహ్వాన పత్రికను కూడా మంత్రులు, ఇతర ముఖ్యులకు పంపించింది ప్రభుత్వం.
ప్రపంచ వ్యాప్తంగా దేశ కీర్తిని చాటి చెప్పిన
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) October 30, 2025
క్రీడాకారుల్లో అజారుద్దీన్ ఒకరు.
దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్ గా వ్యవహరించిన
అజారుద్దీన్ దేశానికి ఎంతో సేవ చేశారు.
మహమ్మద్ అజారుద్దీన్ గారిని మంత్రి వర్గంలోకి తీసుకోకుండా
బీజేపీ కుట్రలు చేస్తోంది.
విఖ్యాత… pic.twitter.com/i8HSxQvDPh
Also Read : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..ఆ ప్రాంతాల్లో పర్యటన..అధికారులకు ఆదేశాలు
బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర: భట్టి
విఖ్యాత క్రీడాకారుడైన అజారుద్దీన్ కు అవకాశం అందిస్తుంటే బీజేపీ అడ్డుకుంటోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా దేశ కీర్తిని చాటి చెప్పిన క్రీడాకారుల్లో అజారుద్దీన్ ఒకరని ఆరోపించారు. దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్ గా వ్యవహరించిన అజారుద్దీన్ దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. అలాంటి మహమ్మద్ అజారుద్దీన్ ను మంత్రి వర్గంలోకి తీసుకోకుండా బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.
Follow Us