CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం..ఆ ప్రాంతాల్లో పర్యటన..అధికారులకు ఆదేశాలు

మొంథా తుఫాన్‌ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఈ రోజు జిల్లాల కలెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. 

New Update
CM Revanth

CM Revanth

CM Revanth Reddy : మొంథా తుఫాన్‌(Cyclone Montha Effect On Telangana) నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఈ రోజు ఆయా జిల్లాల కలెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ఇది వరి కోతల కాలం… అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోందన్నారు.అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. 

Also Read :  వీడో పైశాచిక లవర్..  వేలు గోర్లు కత్తిరించి..ఆపై లైంగిక దాడి

CM Revanth Reddy Video Conference

ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం కలగగుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్ వే ల వద్ద, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలి. అవసరమైనచోట అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరంగల్ లో తుఫాన్(cyclone montha 2025) ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట హైడ్రా సేవలను వినియోగించుకోవాలన్నారు. 24 గంటలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలి. అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రికి తెలపాలన్నారు. 

వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు.ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రాణనష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరి ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదన్నారు.వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ్టి వరంగల్ ఆకస్మిక పర్యటన వాయిదా వేసుకున్నానన్న రేవంత్ రెడ్డి రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తానన్నారు. తుఫాను ప్రభావిత జిల్లా ఇంచార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ,క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Also Read: తీరం దాటిన మొంథా తుపాను.. ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

Advertisment
తాజా కథనాలు