Atishi: కన్నీళ్లు పెట్టుకున్న సీఎం అతిషి.. వీడియో వైరల్

ఢిల్లీ సీఎం అతిషి మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల బీజేపీ నేత రమేశ్ బిదూరి.. అతిషి ఇంటి పేరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Atishi marlena

Atishi marlena

ఢిల్లీ సీఎం అతిషి మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల బీజేపీ నేత రమేశ్ బిదూరి.. అతిషి ఇంటి పేరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దేశంలో రాజకీయాలు దిగజారిపోయాయని.. ఎన్నికల కోసం బీజేపీ నేత మా తండ్రిని అవమానించారంటూ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అతిషి మాట్లాడుతూ.. '' రమేష్ బిదూరికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మా నాన్న తన జీవితాంతం టీచర్‌గా పనిచేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వేలాది మంది పిల్లలకు బోధించారు. 

Also Read: BPSC పేపర్‌ లీక్‌ వ్యవహారం.. ప్రశాంత్ కిషోర్ జైలుకు తరలింపు

ఇప్పుడు ఆయనకు 80 ఏళ్లు. ప్రస్తుతం ఆయన అనారోగ్యం పాలయ్యారు. మరొకరి సాయం లేకుండా ఆయన నడవలేరు. ఎలక్షన్ కోసం మీరు (రమేష్ బిదూరిని ఉద్దేశిస్తూ) ఇలాంటి దుర్మార్గపు పనులకు పాల్పడుతారా ?. ఒక పెద్దాయన్ని దూషించే స్థాయికి వచ్చేశారు. దేశంలో రాజకీయాలు ఇతంలా దిగజారిపోతాయని నేను ఎప్పుడూ అనుకోలేదని'' అతిషి అన్నారు.  

Also Read: భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?

ఇదిలాఉండగా.. ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. కల్కాజీ నియోజకవర్గం నుంచి సీఎం అతిషి పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి రమేశ్ బిదూరి బరిలోకి దిగారు. అయితే ఇటీవల బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రమేశ్ బిదూరి మాట్లాడుతూ అతిషిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అతిషి తన ఇంటి పేరును మార్లెనా నుంచి సింగ్‌కు మార్చుకుందని అన్నారు. కాగా 2019లో పార్లమెంటు ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి అతిషి పోటీ చేశారు. మాజీ క్రికెటర్ గంభీర్ చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. అయితే ఆ సమయంలో ప్రత్యర్థులు అతిషి ఇంటి పేరు మార్చుకుందని ప్రచారాలు చేశారు. అయితే తాజాగా రమేష్ బిదూరి మళ్లీ.. అతిషి ఇంటి పేరు మార్చుకుందని అనడంతో వివాదం చెలరేగింది. 

Also Read: ఆర్మీ కాన్వాయ్‌ పై ఆత్మాహుతి దాడి..47 మంది సైనికులు మృతి

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు