Navodaya: నవోదయలో దారుణం.. బాలికలపై నలుగురు టీచర్ల లైంగిక దాడి!

తెలంగాణలో మరో దారుణం జరిగింది. కామారెడ్డి నిజాంసాగర్‌ జవహర్‌ నవోదయ విద్యాలయంలో నలుగురు టీచర్లు విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు వెలుగులోకి వచ్చింది. వారిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై శివకుమార్‌ చెప్పారు.

New Update
Kurnool : సమాజం సిగ్గుపడే ఘటన.. సొంత చెల్లికే ప్రెగ్నెంట్ చేసిన కామాంధుడు!

Navodaya: తెలంగాణలో మరో దారుణం జరిగింది. విద్యాబుద్దులు నేర్పి పిల్లలను సరైన మార్గంలో నడపాల్సిన ఉపాధ్యాయులే కామాంధులై కాటేసిన మరో ఘటన సంచలనం రేపుతోంది. పట్టుమని పదిహేనేళ్లుకూడా లేని పసి పిల్లలతో లైంగిక కోరికలు తీర్చుకోవాలని చూసిన దుర్మార్గుల ఆఘాయిత్యాల గురించి తెలిసి సమాజం ఉలిక్కిపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగు టీచర్లు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన కామారెడ్డి జిల్లా నిజాం సాగర్‌లోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. 

బూతులు.. బ్యాడ్ టచ్

ఈ మేరకు విధ్యార్థినిలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌ నవోదయ విద్యాలయంలో నలుగురు టీచర్లు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. క్లాసు రూమ్ ల్లోనే కాదు డ్రిల్ పీరియడ్‌లో ఆరు బయట కూర్చున్నపుడు, గేమ్స్ ఆడుతున్నపుడు దగ్గరకొచ్చి వల్గర్ భాష వాడేవారని, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో విసిగించేవారని తెలిపారు. కొన్నిసార్లు బ్యాడ్ టచ్ కూడా చేసిన సందర్భాలున్నాయని వాపోయారు. 

ఇది కూడా చదవండి: Prashant Kishor: BPSC పేపర్‌ లీక్‌ వ్యవహారం.. ప్రశాంత్ కిషోర్ జైలుకు తరలింపు

దీంతో వెంటనే ప్రిన్సిపల్ కు విషయం చెప్పడంతో బాగోతం బయటపడింది. పేరెంట్స్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పోలీసు కేసు నమోదు చేశారు. ఒక టీచర్‌ను కర్ణాటకకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ తర్వాత పోలీసులు విచారణలో మిగతా ముగ్గురు టీచర్స్ గురించి వెలుగులోకి వచ్చింది. వారిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు నిజాం సాగర్‌ ఎస్సై శివకుమార్‌ చెప్పారు.

ఇది కూడా చదవండి: Pushpa2: 'బాహుబలి 2' ని రికార్డును బ్రేక్ చేసిన 'పుష్ప2'.. లేటెస్ట్ కలెక్షన్స్ ఎంతంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు