Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర

తెలంగాణాలో కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఖరారైంది.ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను టీపీసీసీ ప్రకటించింది. ఏఐసీసీ ఆదేశానుసారం ఈ నెల 31వ తేదీ నుంచి తెలంగాణ  ఉమ్మడి జిల్లాల్లో ఒక నియోజక వర్గంలో  పాదయాత్ర చేస్తారు.

New Update
Meenakshi Natarajan

Meenakshi Natarajan

Meenakshi Natarajan: :  తెలంగాణాలో కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఖరారైంది.ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను టీపీసీసీ ప్రకటించింది. ఏఐసీసీ ఆదేశానుసారం ఈ నెల 31వ తేదీ నుంచి తెలంగాణ  ఉమ్మడి జిల్లాల్లో ఒక నియోజక వర్గంలో  పాదయాత్ర , శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించనుంది.ఈ మేరకు టీపీసీసీ దీనికి సంబంధించి ప్రణాళిక రూపొందించింది. ఈ కార్యక్రమాల్లో  ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొంటారని తెలిపింది

472105-whatsapp-image-2025-07-28-at-33619-pm

Also Read:సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం

ఒక్కో జిల్లా నియోజకవర్గంలోని ఒక ముఖ్యమైన కేంద్రంలో సాయంత్రం 5 గంటల నుంచి సుమారు10 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిస్తారు. అనంతరం అక్కడే కాంగ్రెస్ కార్యకర్తలతో పల్లె నిద్ర చేస్తారు. మరుసటి రోజు తెల్లవారు జామున లేచి గ్రామంలో పెద్ద ఎత్తున శ్రమదానం నిర్వహిస్తారు. అనంతరం ఆ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, మండల అధ్యక్షుడు, డీసీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, గ్రామ సర్పంచులు.. ఇలా ఆ ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేతలతో సమావేశం నిర్వహించి, సాయంత్రం మరో నియోజకవర్గంలో పాదయాత్ర కార్యక్రమాలు చేపడుతారు. మొదటి విడతగా ఆరు జిల్లాల్లో ఒక్కో నియోజక వర్గాన్ని ఎంపిక చేసుకొని జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది.

472107-whatsapp-image-2025-07-28-at-33621-pm

Also Read:పెళ్లికి ముందు HIV టెస్టు తప్పనిసరి.. మంత్రి సంచలన ప్రకటన

కాగా ఈ కార్యక్రమానికి గాను ఎమ్మెల్యే ఎం.ఎస్‌.రాజ్‌ ఠాగూర్, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్ , కేతూరి వెంకటేష్‌, జూలురు ధనలక్ష్మి, పులి అనిల్‌కుమార్‌లను కో ఆర్డినేటర్లుగా అధిష్టానం నిర్ణయించింది. 

కాగా తొలివిడత కార్యక్రమంలో భాగంగా రంగారెడ్ది జిల్లా పరిగి, మెదక్‌ జిల్లా ఆందోల్‌, నిజమాబాద్‌ జిల్లా ఆర్మూర్‌, ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌, కరీంనగర్‌ జిల్లా చొప్పదండి, వరంగల్‌ జిల్లా వర్థన్నపేట తదితర నియోజకవర్గాల్లో పాదయాత్ర, శ్రమదానం కొనసాగుతుంది.

Also Read:వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!

Advertisment
తాజా కథనాలు