/rtv/media/media_files/2025/02/22/llabX6VrYThO4jXQlQAX.jpg)
Koneru Konappa CM Revanth Reddy
సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంపీ ఎన్నికలకు ముందే ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే.. ఏడాది కాకముందే ఆ పార్టీకి రాజీనామా ప్రకటించడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయమై నేరుగా రంగలోకి దిగారు. కోనేరు కొన్నప్పను పిలిచి మాట్లాడారు. అయితే.. నియోజకవర్గంలో తన మాట నెగ్గడం లేదని, గతంలో తాను మంజూరు చేసిన అభివృద్ధి పనులను పక్కన పెట్టేశారని కోనప్ప సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Kavitha : రేవంత్ సీఎం కావడం తెలంగాణ ఖర్మ.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
దీంతో ఆ సమస్యను పరిష్కారానికి రేవంత్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యతలు తనకే అప్పగించాలని రేవంత్ ను కోరినట్లు కోనప్ప సన్నిహితులు చెబుతున్నారు. ఇందుకు రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వెనక్కు తగ్గిన కోనప్ప కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: BIG BREAKING : శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్‌లో ప్రమాదం!
కాంగ్రెస్ లో కొత్త బిచ్చగాళ్లంటూ ఇటీవల హాట్ కామెంట్స్..
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ తీరుపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మండిపడడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రూ.75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లై ఓవర్‌ను క్యాన్సిల్ చేయడంపై కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారు.. మీకు అంత సీన్ లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. గ్రామాల్లోకి వచ్చే నాయకులను గల్లా పట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు.
తాను ఎవరికీ భయపడనని కూడా తేల్చిచెప్పారు. గతంలో టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన విషయం కూడా గుర్తు చేశారు. సీఎంను కలిసి చాలా సార్లు ఫ్లై ఓవర్ పూర్తి చేయాలని చెప్పినా.. స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నిన్న పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. తాజాగా రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.