SLBC Accident: శ్రీశైలం ప్రమాదానికి కారణం అదే.. ఆ ఏడుగురు ఎక్కడ?: మంత్రి ఉత్తమ్ షాకింగ్ ప్రకటన!

నీళ్లు, మట్టి సొరంగలోకి రావడంతోనే శ్రీశైలం ఎడమ కాలువ సొరగంలో ప్రమాదం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సొరంగంలో అందుబాటులో ఉన్న అందరినీ బయటకు తీసుకువచ్చామన్నారు. మరో ఏడుగురు కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదన్నారు.

New Update
TG Minister Uttam Kumar Reddy

శ్రీశైలం ఎడమగట్టు కాలువలో ప్రమాదంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నీళ్లు, మట్టి సొరంగలోకి రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుతం సొరంగంలో అందుబాటులో ఉన్న అందరినీ బయటకు తీసుకువచ్చామన్నారు. అయితే.. మరో ఏడుగురు కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదన్నారు. వారిని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యలు పర్యవేక్షించడానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సొరంగం వద్దకు హెలీకాప్టర్ లో బయలుదేరారు. 
ఇది కూడా చదవండి: TG Crime: ఉప్పల్‌లో కలకలం..నాలుగో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ఈ రోజ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రాజెక్టును త్వరగా కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది.  
ఇది కూడా చదవండి: kavitha : రేవంత్ సీఎం కావడం తెలంగాణ ఖర్మ.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన పనులు..

నాలుగు రోజుల క్రితం ఎడమవైపు సొరంగం వద్ద మళ్లీ పనులు ప్రారంభం కాగా, శనివారం ఉదయం పైకప్పు కూలింది. ఇందులో ఏడు మంది కార్మికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది.  దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రమాద స్థలాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. క్షతగాత్రలను వెంటనే జెన్ కో ఆసుపత్రికి తరలించారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు