సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు తన సొంతూరు నిజామాబాద్‌లో నిర్వహించిన "సంక్రాంతికి వస్తున్నాం" ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. స్టేజ్‌పై మాట్లాడుతున్నప్పుడు, 'ఆంధ్రాలో సినిమా అంటే వైబ్, కానీ ఇక్కడ మన వాళ్లకు కల్లు, మటన్ అంటే వైబ్' అని చెప్పిన దిల్ రాజు వ్యాఖ్యలు, తెలంగాణ ప్రజల్ని కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నాయకులు, దేశపతి శ్రీనివాస్ వంటి ప్రముఖులు సైతం దిల్ రాజును విమర్శించారు. తెలంగాణ సమాజంపై చిన్నచూపుతో మాట్లాడారని ఆరోపిస్తూ, ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీంతో దిల్ రాజు తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ' తెలంగాణ సమాజాన్ని కించపరిచే ఉద్దేశం నాకు అసలు లేదు. Also Read : 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ #DilRaju garu has spoken out about the Nizamabad incident, offering his sincere apologies to anyone who may have been hurt. He has requested not to associate him with politics in any way. pic.twitter.com/X9W3grU8O0 — Sri Venkateswara Creations (@SVC_official) January 11, 2025 నేను తెలంగాణ వాడిని, ఇక్కడి సంస్కృతిని గౌరవిస్తాను. తెలంగాణ కల్చర్, దావత్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఈవెంట్‌లోనూ దావత్‌ను మిస్ అయ్యానని, నా రెండు చిత్రాలు విడుదలైన తర్వాత ఇక్కడకు వచ్చి దావత్ చేసుకుంటానని చెప్పాను. నా వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బ తీశాయని తెలిసింది. వాళ్లకు కోసం క్షమాపణలు కోరుతున్నాను..' అని పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతిపై తనకు ఎంతో అభిమానం ఉందని తెలుపుతూ..' తెలంగాణ సంస్కృతిని నేను అభిమానిస్తాను. నేను ఫిదా అని తీసి ఇక్కడి కల్చర్‌ను ప్రపంచ వ్యాప్తంగా చూపించాను.. బలగం సినిమాను తీస్తే మా అందరినీ ఊరురా ప్రశంసించారు.. అలాంటి నేను తెలంగాణను ఎందుకు తక్కువ చేసి మాట్లాడతానని ఎలా అనుకున్నారు. ఒకవేళ నా మాటల్లో ఏదైనా మిస్ కమ్యూనికేషన్ జరిగుండి, మీ మనోభావాలు దెబ్బ తిని ఉంటే నన్ను క్షమించండి..' అని అన్నారు. Also Read : సంక్రాంతికి 'రాజా సాబ్' అప్డేట్.. ఏంటో తెలుసా?