Viral News: టీసీఎస్ ఉద్యోగి దీనపరిస్థితి.. ఆఫీస్ ముందే మూడు రోజులు! వైరలవుతున్న లెటర్

అతడి  కళ్ళలో ఆశ, ఆవేదన.. జులై 31న జీతం అకౌంట్లో పడుతుందని హెచ్‌ఆర్ చెప్పాడు, కానీ అది ఇంకా రావట్లేదు. జీతం రాకపోవడంతో అద్దెకట్టుకోలేక, తినడానికి డబ్బులేక, ఎప్పుడు జీతం పడుతుందా అని ఆఫీస్ ముందే పడిగాపులు కాస్తూ అల్లాడిపోతున్నాడు.

New Update
TCS Employee

TCS Employee

Viral News: అతడి  కళ్ళలో ఆశ, ఆవేదన.. జులై 31న జీతం అకౌంట్లో పడుతుందని హెచ్‌ఆర్ చెప్పాడు, కానీ అది ఇంకా రావట్లేదు. జీతం రాకపోవడంతో అద్దెకట్టుకోలేక, తినడానికి డబ్బులేక, ఎప్పుడు జీతం పడుతుందా అని ఆఫీస్ ముందే పడిగాపులు కాస్తూ అల్లాడిపోతున్నాడు. జీతమ చెల్లించకపోవడంతో ఆఫీస్ ఎదుట ఫుట్ పాత్ నిద్రిస్తూ నిరసన తెలిపాడు. తన ఆఫీస్ బ్యాగ్ నే దిండుగా చేసుకొని మూడు రోజులగా రోడ్డుమీదే పడుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో, అతడు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. 

జీతం కోసం రోడ్డుపై పడిగాపులు 

పుణెలోని టీసీఎస్ సహ్యాద్రి పార్క్ క్యాంపస్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న సౌరబ్ మోరే అనే ఉద్యోగికి  జులై 31న జీతం క్రెడిట్ అవుతుందని తన హెచ్చార్  చెప్పగా..  శాలరీ ఇంకా క్రెడిట్ అవ్వలేదట.  దీంతో పూణే సిటీలో జీవనం కొనసాగించడానికి డబ్బులు లేఖ.. జులై 29 నుంచి జీతం పడుతుందేమోనని ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులుగా ఫుట్ పాత్ పైనే పడుకుంటున్నాను అంటూ లేఖలో తన దీనపరిస్థితిని తెలిపాడు. ఇప్పటికే లేఆఫ్స్ కారణంగా టీసీఎస్ పట్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత, నెగిటివ్ ఫీలింగ్ ఉండగా.. ఈ ఘటన కంపెనీ ఇమేజ్ ని మరింత డ్యామేజ్ చేసింది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఒక కంపెనీ తమ ఉద్యోగుల పట్ల ఇలా వ్యవహరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. టీసీఎస్ ఉద్యోగుల వెల్ఫేర్ కి ప్రాధాన్యత ఇచ్చే సంస్థగా ఉండేది. కానీ ఇప్పుడు ఇతర కంపెనీల బాటలో లాభాలు లక్ష్యంగా ఉద్యోగుల భద్రతను గాలికొదిలేస్తుందని విమర్శలు వస్తున్నాయి.  ఆర్థిక సంక్షోభం, ఏఐ టెక్నాలజీతో  కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటున్న వేళ ఇలాంటి సంఘటనలు ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.

ఇదిలా ఉంటే టీసీఎస్ ఇటీవలే షాకింగ్ ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి తమ కంపెనీలో 20 శాతం అంటే దాదాపు 12000 మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతున్నట్లు తెలిపింది. సాంకేతిక రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టీసీఎస్ సంస్థ  సీఈవో కె.కృతివాసన్‌ ఓ ఇంటర్వూలో తెలిపారు. జూన్ నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,000 గా ఉన్నట్లు తెలుస్తోంది.  టీసీఎస్ మాత్రమే కాదు చాలా ఐటీ  కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి.సాంకేతిక రంగంలో   ఏఐ టెక్నాలజీ ప్రభావమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

Also Read: US investment visas: అమెరికా పెట్టుబడుల వీసాలకు డిమాండ్‌.. ఆసక్తి చూపుతున్న భారతీయులు

Advertisment
తాజా కథనాలు