KTR: అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్కు KTR కౌంటర్.. సంచలన కామెంట్స్!

తాను అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారని ధ్వజమెత్తారు.

New Update
KTR Navya

ఖచ్చితంగా భవిష్యత్తులో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేసి తీరుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ తమకు 80 వేల ఓట్లు వస్తే ఈ ఉప ఎన్నికలో 75 వేల ఓట్లు వచ్చాయన్నారు. ఇన్ని కుట్రలు, రిగ్గింగ్ చేసినా తమ ఓట్లు కేవలం 5 వేలు మాత్రమే తగ్గాయన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తనదని భరోసానిచ్చారు. రహమత్ నగర్ లో నిన్న జరిగిన ఘర్షణలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ ను కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ కార్యకర్తపై జరిగిన దాడిని ఖండిస్తున్నానన్నారు.

Also Read :  జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ కు TDP సైలెంట్ సపోర్ట్!

KTR Sensational Comments On Jubilee Hills

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు(jubilee hills by election 2025 results) వచ్చి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతోందని ఆరోపించారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నామని.. చాలా ఉప ఎన్నికల్లో గెలిచామన్నారు. ఎప్పుడు తాము నేడు కాంగ్రెస్ మాదిరిగా దాడులు చేయలేదన్నారు. కాంగ్రెస్ చేస్తున్న రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. తమ కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలన్నారు. దొంగ ఓట్లు, గూండా గిరి, డబ్బులు పంచి కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు.

తాను అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం రేవంత్(Revanth Reddy) వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ స్పందించారు. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయ గర్వంతో నిన్న ఊరేగింపు తీశారన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ గుండాయిజం మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Also Read :  శత్రువులు ఎక్కడో ఉండర్రా..? కూతుళ్లు, చెల్లెళ్లుగా..కవిత ట్వీట్ కు BRS కౌంటర్!

Advertisment
తాజా కథనాలు