మంత్రి పదవి, మంత్రి పదవి అని అడుక్కుంటూ నల్గొండ జిల్లా పరువు తీస్తున్నావంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(komatireddy-rajagopal-reddy) పై బీజేపీ(BJP) నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ ప్రజల కోసం, జిల్లా అభివృద్ధి గురించి అడగకుండా మంత్రి పదవి అడుక్కోవడం ఏంటి? అని ఫైర్ అయ్యారు. ఆయన తీరు చూస్తుంటే నల్గొండ వాసులుగా మాకే సిగ్గనిపిస్తోందంటూ ధ్వజమెత్తారు. రాజగోపాల్ రెడ్డికి అంత సత్తా ఉంటే పదవికి రాజీనామా చేసి సొంతగా నిలబడాలని సవాల్ విసిరారు. అంత గౌరవం లేని చోట ఉండటం ఎందుకని ప్రశ్నించారు.
2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన బూర నర్సయ్య గౌడ్(Bura Narsaiagh Goud) కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై గెలుపొందారు. అయితే.. ఆ తర్వాత వచ్చిన 2019 ఎన్నికల్లో నర్సయ్య గౌడ్ పై రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అన్న గెలుపులో కీలక పాత్ర పోషించి గతంలో తనను ఓడించిన పగ తీర్చుకున్నాడు నర్సయ్య గౌడ్. దీంతో వీరి మధ్య వైరం అప్పటి నుంచి ఉంది. అయితే.. గతంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మునుగోడు నుంచి తాను బరిలో ఉండాలని బూర నర్సయ్య గౌడ్ భావించారు.
Also Read : బాలికల హాస్టల్లో ఘోరం.. తొమ్మిది మందిని కరిచిన ఎలుకలు
మునుగోడుపై బూర ఫోకస్..?
కానీ బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇచ్చింది. దీంతో మనస్థాపానికి గురైన బూర నర్సయ్య గౌడ్ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. రాజగోపాల్ రెడ్డి గెలుపుకోసం విస్తృతంగా పని చేశారు. కానీ ఆ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం, ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేలగా గెలవడం జరిగిపోయాయి. ఇదిలా ఉంటే.. బూర నర్సయ్య గౌడ్ మళ్లీ మునుగోడు నియోజకవర్గంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలో భారతీయ జనతా పార్టీ కొత్త కార్యాలయాన్ని ఆయన పార్టీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి కొరత, సాగునీటి సమస్యలు, ఉపాధి లోపం, రోడ్ల దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. కేంద్రం ఎంత కృషి చేసినా, రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో అభివృద్ధికి అడ్డంకులు ఏర్పాడుతున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల అసత్య ప్రచారాలను తప్పుపడుతూ ప్రజలు ఇక మోసపోరని హెచ్చరించారు.మోదీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ స్థాయిలో గౌరవనీయ స్థానాన్ని సంపాదించింది. అభివృద్ధి మార్గంలో దేశం ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యాలయం గ్రామస్థాయి నుండి బీజేపీ బలోపేతానికి కేంద్రంగా మారనుందన్నారు.
Also Read : లండన్‌లో భారతీయ రెస్టారెంట్‌కు నిప్పు.. సీసీ కెమెరాల్లో సంచలన దృశ్యాలు
Bura Narsaiagh Goud: నల్గొండ పరువు తీయకు.. రాజగోపాల్ రెడ్డిపై సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!
మంత్రి పదవి, మంత్రి పదవి అని అడుక్కుంటూ నల్గొండ జిల్లా పరువు తీస్తున్నావంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా అభివృద్ధి గురించి అడగకుండా మంత్రి పదవి అడుక్కోవడం ఏంటి? అని ఫైర్ అయ్యారు.