Telangana BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ డిస్మిస్.. రేవంత్ సర్కార్ కు సుప్రీంకోర్టు బిగ్ షాక్..

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.

New Update
BREAKING

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల(telangana bc reservations) వ్యవహారంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రేవంత్(Revanth Reddy) సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జీవో నంబర్.9పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టు(Supreme Court) ను ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది న్యాయస్థానం. దీంతో రేవంత్ సర్కార్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అశంపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు బీసీ సంఘాలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కానున్నారు.  

Also Read :  ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్

Telangana BC Reservations Hike

తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకంగా తీర్మానించాయని తెలిపారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించి బీసీల లెక్కలు తేల్చిందన్నారు. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వివరించారు. గవర్నర్ బిల్లు  పెండింగ్లో పెట్టడం కారణంగా ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్ లో పెట్టారని వివరించారు. బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్  చేశారన్నారు. రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహానీ జడ్జిమెంట్ లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం  తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్  టెస్ట్ కండిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని న్యాయస్థానానికి తెలిపారు.   

ఈ అంశంపై రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డి తరఫున న్యాయవాదులు కౌంటర్ వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసిందని వివరించారు. షెడ్యూల్డ్ ఏరియా, గిరిజన ప్రాంతాల్లో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఉందని వివరించారు. జనరల్ ఏరియాల్లో రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచడానికి వీలులేదన్నారు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవన్నారు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు ఇచ్చిందన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించిందన్నారు.  ట్రిపుల్ టెస్ట్ లో కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండదన్నారు. 

Also Read :  బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ.. సంచలన నిర్ణయం!

Advertisment
తాజా కథనాలు