New Update
/rtv/media/media_files/2025/10/16/konda-surekha-cm-revanth-reddy-2025-10-16-11-49-49.jpg)
కొండా సురేఖ మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. నిన్న ఆమె ఓఎస్డీని ప్రభుత్వం టర్మినేట్ చేయడం.. రాత్రి అతడిని అరెస్ట్ చేయడానికి ఏకంగా తన ఇంటికే పోలీసులు రావడంతో సురేఖ తీవ్ర మనస్తాపానికి గురయ్యారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే మంత్రివర్గ సమావేశానికి ఆమె హాజరుకాదన్న ప్రచారం సాగింది. అయితే.. ఈ విషయమై సురేఖ మనస్సు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. మరో వైపు సహచర మంత్రులు సురేఖకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తాజా కథనాలు