Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వచ్చే 24 గంటల్లో మరింత బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. డిసెంబర్ 15 వరకూ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.

New Update
rains

Ap Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15వ తేదీ వరకూ వానలు పడతాయని  ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోందని.. వచ్చే 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశాలున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు. బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

Also Read: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌!

మోస్తరు నుంచి భారీ వర్షాలు..

ఈ అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 15 వరకూ అంటే.. వచ్చే ఆదివారం వరకూ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.మరోవైపు అల్పపీడనం ప్రభావంతో బుధవారం, గురువారాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. సోమవారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు వివరించారు. వచ్చే వారం రోజుల పాటు అల్పపీడనం ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో పంటకోతలు, వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ అన్నారు.

Also Read: యుద్ధంలో 43 వేల మంది సైనికులను కోల్పోయాం, శాంతి కావాలి: జెలెన్స్కీ

కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచి. గింజ మొలకెత్తకుండా ఉండేందుకు ఐదుశాతం ఉప్పు ద్రావణాన్ని పనలపై  పిచికారీ చేయాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. అలాగే రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని.. ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Also Read: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. చదవని మెస్సేజ్‌లను గుర్తుచేస్తోందట!

ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే వాటి నివృత్తి కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ చెప్పారు. ఇటీవల ఫెంగల్ తుఫాను కారణంగా ఏపీలోని చాలా జిల్లాలలో పంట నష్టం జరిగింది. రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందుజాగ్రత్తలు చెబుతుంది. వారం రోజుల పాటు అల్పపీడనం ప్రభావం ఉండనున్న నేపథ్యంలో.. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read: KCR: కొత్త తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై కేసీఆర్‌ షాకింగ్ రియాక్షన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు