/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/assembly-jpg.webp)
Telangana Assembly
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు తేది ఖరారైంది. మార్చి 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఈ రోజు సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు మార్చి 27వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు సచివాలయంలో జరుగుతున్ కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయ పరమైన చిక్కులు లేకుండా ముసాయిదా బిల్లుకు తుదిమెరుగులు దిద్దాలని సమావేశంలో ముఖ్య మంత్రి ఆదేశించారు. ఇందుకోసం న్యాయనిపుణుల సలహాలు తీసుకొని తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
Also Read: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్
ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ సిఫార్సుల్లో మూడింటిని ఇప్పటికే ఆమోదించిన కేబినెట్ ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చర్చించనుంది. వీటితో పాటు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో ప్రధాని మోదీతో సమావేశం, ఏపీతో నీటి వివాదంపై అనుసరించాల్సిన వ్యూహం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Also Read: ఇడ్లీ-సాంబార్ గోవా టూరిజాన్ని నాశనం చేసింది.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం!
కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. 10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. మరోవైపు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించనున్నది. ఆశావహుల సంఖ్య భారీగా పెరగడంతో ఎటూ తేల్చుకోలేక పోతున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. ఏఐసీసీ నిర్ణయం మేరకు తుది నిర్ణయం తీసుకునేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
ఇది కూడా చూడండి: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్