TS: అంగన్వాడీలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..!
తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. అంగన్వాడీ టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్ అందజేస్తామని ఆమె వెల్లడించారు. దీనిపై రెండు మూడు రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు.