/rtv/media/media_files/2025/12/09/10th-exams-2025-12-09-19-17-22.jpg)
విద్యార్థులు, తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న పదో తరగతి(10th-class-exams) వార్షిక షెడ్యూల్(schedule) వచ్చేసింది. ఈ కీలక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన వెంటనే టెన్త్ ఎగ్జామ్స్ మొదలవనున్నాయి. ప్రతీ పరీక్షకు నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చారు. పండుగల సమయాలు, సెలవు దినాలు ఈ పరీక్షల మధ్య రావడం వలన విద్యార్థులకు నాలుగు రోజుల వరకు గ్యాప్ లభించిందని విద్యాశాఖ తెలిపింది. ఇది కూడా విద్యార్థుల మంచికే జరిగిందని..విరామం కారణంగా వారు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఒక్కో సబ్జెక్టుపై దృష్టి సారించడానికి .. రివిజన్ చేసుకోవడానికి సమయం దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు. దీని వలన ఉత్తమ ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.
Also Read : తెలంగాణలో సల్మాన్ ఖాన్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి.. ఎక్కడ, ఏ రంగంలో అంటే?
SSC Examination Time Table pic.twitter.com/qisPRvoGtj
— Jacob Ross (@JacobBhoompag) December 9, 2025
Also Read : తెలంగాణలో ట్రంప్ కంపెనీ రూ.లక్ష కోట్ల పెట్టుబడి.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఉదయం 9.30 నుంచి 12.30 వరకు..
అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరగనున్నాయి. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు రెండు భాగాలుగా.. వేర్వేరు రోజుల్లో జరగనున్నాయన్నారు. ఏప్రిల్ 2 ఫిజికల్ సైన్స్..ఏప్రిల్ 7న బయోలాజికల్ సైన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఈ రెండు సైన్స్ పేపర్లు ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించనున్నారు. మార్చి 14, 2026 ఫస్ట్ లాంగ్వేజ్ , మార్చి 18, 2026 సెకండ్ లాంగ్వేజ్ , మార్చి 23, 2026 థర్డ్ లాంగ్వేజ్ , మార్చి 28, 2026 మ్యాథమాటిక్స్ , ఏప్రిల్ 02, 2026 ఫిజికల్ సైన్స్ , ఏప్రిల్ 07, 2026 బయోలాజికల్ సైన్స్ , ఏప్రిల్ 13, 2026 సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి.
Follow Us