Trump: తెలంగాణలో ట్రంప్ కంపెనీ రూ.లక్ష కోట్ల పెట్టుబడి.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ సోమవారం ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ సదస్సుకు ఏకంగా 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొదటిరోజునే రాష్ట్రానికి రూ.1.88 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.

New Update
Trump

Trump

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ సోమవారం ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ సదస్సుకు ఏకంగా 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొదటిరోజునే రాష్ట్రానికి రూ.1.88 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. డీప్‌ టెక్నాలజీ, గ్రీన్‌ ఎనర్జీ, ఏరోస్పేస్‌తో సహా పలు రంగాల్లో వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఈ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సదస్సులో ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ డైరెక్టర్‌ ఎరిక్ చేసిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది. వచ్చే పదేళ్లలో ఫ్యూచర్‌ సిటీలో, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

TMTG ఎలా ప్రారంభమైందంటే ?

ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రంప్‌ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌ కార్పోరేషన్‌(TMTG)లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రివోకబుల్ ట్రస్ట్‌కు 52 శాతం షేర్ ఉంది. ఈ ట్రస్టు కింద మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఫ్లొరిడాలో ఉన్న సరసోటాలో ఆ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. అక్కడి నుంచే ఇది కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతేకాదు ట్రంప్‌ తరచుగా పోస్టులు పెట్టే ట్రూత్‌ సోషల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఈ కంపెనీయే ఆపరేట్ చేస్తుంది. అయితే ఈ ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్‌ను 2021లో స్థాపించారు. ఆ ఏడాది జనవరి 6న అమెరికా క్యాపిటల్‌ వద్ద జరిగిన అల్లర్ల తర్వాత ట్రంప్‌ను ఎక్స్‌, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన మద్దతుదారులతో సంభాషించేందుకు ట్రంప్ తన సొంత వేదిక అవసరాన్ని గుర్తుంచి ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. 

Also Read :  గుడ్‌న్యూస్.. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధరలు వెల్లడించిన మస్క్‌

ఆ రంగాలను విస్తరించడమే లక్యం

ఈ కంపెనీ.. డిజిటల్ వరల్డ్‌ అక్వజిషన్‌ కార్పొరేషన్ అనే స్పెషల్ పర్పస్‌ అక్విజిషన్ కంపెనీ (SPAC)తో వీలీనమైన తర్వాత 2024 మార్చిన 26న NASDAQ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో DJT అనే టిక్కర్ గుర్తుతో పబ్లిక్‌గా లిస్ట్ చేయబడింది. అయితే ఈ సంస్థ ఇప్పటిదాకా లాభదాయకతను నమోదు చేయలేదు. ఇది ప్రధానంగా ఆదాయం కోసం ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్‌లపై ఆధారపడాలని యోచిస్తోంది. అయితే TMTG సోషల్ మీడియాకు మించి తన సేవలను మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో వార్తలు, వినోదం, అలాగే పాడ్‌కాస్ట్‌లపై దృష్టి సారించి ఒక ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ను తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పుడు ఈ సంస్థ రాబోయే పదేళ్లలో తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టామని ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కూడా ఈ కంపెనీకి సంబంధించిన సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

Also Read: ఆ దేశంలో పురుషుల కొరత.. భర్తలను రెంట్‌కు తెచ్చుకుంటున్న మహిళలు..

మరోవైపు హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచి వెళ్లే ప్రధాన రోడ్‌కు ట్రంప్‌ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. డొనాల్ట్‌ ట్రంప్‌ అవెన్యూగా పేరు పెట్టాలని భావిస్తోంది. మరోవైపు ఈ సదస్సులో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ కూడా కీల ప్రకటన చేశారు. రూ.25 వేల కోట్ల పెట్టుబడితో 48 మెగావాట్ల గ్రీన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే రూ.4 వేల కోట్లతో రహదారి సౌకర్యాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు