Metro Services : ఇక నుంచి ఉదయం 5.30 గంటలకే మెట్రో సేవలు!
ఇక నుంచి హైదరాబాద్ నగరంలో మెట్రో రాకపోకలు ఉదయం 5.30 గంటల నుంచే మొదలు కానున్నట్లు మెట్రో అధికారులు వివరించారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.