TTD మాజీ విజిలెన్స్ అధికారి మృతి కేసులో బిగ్ ట్విస్ట్

TTD మాజీ విజిలెన్స్ అధికారి సతీష్‌కుమార్‌ను చంపేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. పరకామణి కేసులో ప్రత్యర్థులే ప్రాణాలు తీశారని సతీష్‌కుమార్ సోదరుడు ఫిర్యాదు చేయగా..  నిన్న తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపై సతీష్‌కుమార్ మృతదేహం దొరికింది.

New Update
satish kumar

TTD మాజీ విజిలెన్స్ అధికారి సతీష్‌ కుమార్‌(satish) మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సతీష్‌కుమార్‌ను చంపేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. పరకామణి కేసులో ప్రత్యర్థులే ప్రాణాలు తీశారని సతీష్‌కుమార్ సోదరుడు ఫిర్యాదు చేయగా..  నిన్న తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపై సతీష్‌కుమార్ మృతదేహం దొరికింది. తలపై దాడి, శరీరంలో ఎముకలు విరిగినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్ లో వెల్లడైంది. రైల్లోనే కొట్టి కిందకు తోసి ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read :  114 ఏళ్ల ‘వృక్షమాత’ సాలుమరద తిమ్మక్క మృతి.. పవన్ ఎమోషనల్

Also Read :  నడిరోడ్డు మీద పట్టపగలు.. భార్య గొంతు కోసం దారుణంగా హత్య చేసిన భర్త.. కారణమేంటంటే?

పరకామణి చోరీ కేసులో

సతీష్ మృతిపై కేసు నమోదు చేసిన గుత్తి రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. సతీష్ ప్రయాణించిన రైలులో తోటి ప్రయాణికులపై పోలీసులు ఆరా తీశారు. ప్రయాణికుల లిస్టును పోలీసులు పరిశీలిస్తు్న్నారు. పరకామణి చోరీ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సతీష్‌కుమార్..  రెండోసారి సీఐడీ డీజీ ముందు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయన శవమై తేలారు.

ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో సీఐగా ఉన్న సతీష్‌కుమార్‌ గతంలో టీటీడీ ఏవీఎస్‌వోగా పనిచేశారు. పరకామణి కేసులో ఈ నెల 6న సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సతీష్‌కుమార్ మృతికి TTD పరకామణి చోరీ కేసుతో సంబంధం ఉంది. 2023లో ఈ చోరీని గుర్తించి, ఫిర్యాదు చేసినది ఆయనే.

Advertisment
తాజా కథనాలు