Basara RGUKT: ఆర్జీయూకేటీలో మరో విద్యార్థిని బలవన్మరణం..

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మరో విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బాధితురాలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన స్వాతిప్రియగా గుర్తించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Basar IIIT

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా మరో విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన స్వాతిప్రియ బాసర ట్రిపుల్‌ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరు స్నేహితులతో కలిసి హాస్టల్‌లోనే ఉంటోంది. 

ఇది కూడా చదవండి: BIG BREAKING: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ?

ఫ్యాన్‌కు ఉరేసుకొని

సోమవారం ఉదయం స్వాతిప్రియ స్నేహితులు టిఫిన్ చేయడం కోసం వెళ్లారు. గదిలో స్వాతిప్రియ మాత్రమే ఒంటరిగా ఉంది. వాళ్లు తిరిగివచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై విద్యార్థులు సిబ్బందికి తెలియజేయగా.. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. అలాగే స్వాతిప్రియా కుటంబ సభ్యులకు కూడా సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.   

Also Read: సీఎం ఇలాఖాలో ఉద్రిక్తత.. తిరగబడ్డ జనం.. ఏకంగా కలెక్టర్ నే పరిగెత్తించి!

వరుసగా ఆత్మహత్యలు

అయితే మృతిరాలి చేతిలో ఓ సూసైడ్‌ నోట్ ఉన్నట్లు సమాచారం. వ్యక్తిగత సమస్యలతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్వాతిప్రియ మరణంతో ఆమె స్నేహితులు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్జీయూకేటీలో వరుసగా ఇలా ఆత్మహత్యలు జరగడం కలకలం రేపుతోంది.

 2023–24 విద్యాసంవత్సరంలో అక్కడ మొత్తం ఆరుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాసరలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్యాంపస్‌లో ఉండే అధికారులు మాత్రం విద్యార్థుల మానసిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారు. క్యాంపస్‌లో చదివే విద్యార్థుల భవిష్యత్‌పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.   గతంలో ఆర్జీయూకేటీలో సరైన వసతులు లేవని విద్యార్థులు నిరసనలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.  

Also Read: హుటాహుటిన ఢిల్లీకి కేటీఆర్.. రేవంత్ కు బిగ్ షాక్?

ఇది కూడా చదవండి: హుటాహుటిన ఢిల్లీకి కేటీఆర్.. రేవంత్ కు బిగ్ షాక్?

Advertisment
తాజా కథనాలు