BIG BREAKING: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ? ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యేల అరెస్ట్, ప్రాసిక్యూషన్ ప్రొసీజర్‌పై గవర్నర్ కార్యాలయం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. By Seetha Ram 11 Nov 2024 in తెలంగాణ Short News New Update షేర్ చేయండి గతే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్ ప్రారంభమైంది. దీనికి స్పాన్సర్‌గా గ్రీన్ కో-సిస్టర్ కంపెనీ రూ.150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30 కోట్లు, నోడల్ ఏజెన్సీ అయిన హెచ్ఎండీఏ రూ.20 కోట్లు వీటి నిర్వహణ కోసం ఖర్చు చేశాయి. మొత్తం రూ.200 కోట్ల ఖర్చుతో దీనిని నిర్వహించారు. ఈ ఫార్ములా ఈ-రేసుతో ప్రమోటర్స్ బాగా నష్టపోవడంతో స్పాన్సర్‌గా ఎవరూ ముందుకు రాలేదు. ఇది కూడా చూడండి: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. యువకుడు చేసిన పనికి అంతా షాక్! అంతేకాకుండా ఎఫ్‌ఈవో కూడా భారీగా నష్టాలను చవిచూసింది. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ నాలుగు సెషన్లను హైదరాబాద్‌లోనే జరపాలని డీల్ కుదుర్చుకున్నారు. అయితే అప్పటికి ఎన్నికల కోడ్ ఉంది. ఆ సమయంలోనే స్పాన్సర్‌గా ఎవరూ ముందుకు రాకపోవడంతో నోడల్ ఏజెన్సీనే స్పాన్సర్‌గా కేటీఆర్ ప్రకటించారు. అదే విషయాన్ని అప్పటి ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ నోట్ ఫైల్‌లో రికార్డు చేశారు. ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి ఇందులో భాగంగానే సీఎస్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అక్టోబర్ 5న రూ.23 కోట్లు చెల్లించారు. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకో రూ.23 కోట్లు ఇచ్చారు. దానికి రూ.9 కోట్ల టాక్స్‌తో మొత్తం ఫోన్ కాల్‌లోనే రూ.55 కోట్ల సొమ్మును ఎఫ్‌ఈవోకి చెల్లించారు. ఇక ఈసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఈ-కార్ రేస్ సెషన్ 10 ఆగిపోయింది. ఇది కూడా చూడండి: Alert: హైదరాబాద్ వాసులు బి అలెర్ట్...ఈ ఏరియాల్లో వాటర్ బంద్! అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రూ.55 కోట్లహెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలకు సంబంధించి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసింది. అంతేకాకుండా మున్సిపల్ శాఖ ఏసీబీకి కూడా ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగానే అప్పటి సీఎస్ అరవింద్ కుమార్‌పై తాజాగా విచారణ చేయగా.. కేటీఆర్ చెప్తేనే అంతా చేశానని ఆయన తెలపడంతో కేటీఆర్‌ను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గవర్నర్‌కి లేఖ రాసింది. ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై.. కేటీఆర్ విచారణకు రంగం సిద్ధం ఈ మేరకు ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను విచారించేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై ఎమ్మెల్యేల అరెస్ట్, ప్రాసిక్యూషన్ ప్రొసీజర్‌పై గవర్నర్ కార్యాలయం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా(ఏజీఐ)కు న్యాయ సలహా కోసం లేఖ రాసినట్టు సమాచారం. ఆ లేఖలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018, సెక్షన్ 17( ఏ) కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే వివరాలు వెల్లడించాలని కోరినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఏసీబీ, మున్సిపల్ శాఖ అందించిన ఆధారాలను సైతం లేఖలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సలహా అనంతరం సంబంధిత ప్రజాప్రతినిధులను విచారించేందుకు ఏసీబీకి గవర్నర్ అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. #ktr #formula-e-race మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి