సీఎం ఇలాఖాలో ఉద్రిక్తత.. తిరగబడ్డ జనం.. ఏకంగా కలెక్టర్ నే పరిగెత్తించి! సీఎం సొంత నియోజకవర్గం దుద్యాలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీలకు సంబంధించి ప్రజాభిప్రాయం కోసం వచ్చిన కలెక్టర్, ఇతర అధికారులపై జనం దాడి చేశారు. కలెక్టర్, MROలను ప్రజలు పరుగెత్తించి, పరుగెత్తించి కొట్టినట్లు తెలుస్తోంది By Nikhil 11 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వికారాబాద్ జిల్లా దూద్యాల మండలం లగచర్లలో అధికారులపై స్థానికులు రాళ్లు రువ్వారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ ప్రతిక్ జైన్, ఇతర అధికారులు వచ్చారు. అయితే.. వారిపై జగం తిరగబడ్డారు. పిడిగుద్దులు, కర్రలతో చితకబాదారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై దాడి చేశారు. కలెక్టర్ సహా ఇతర అధికారులకు చెందిన మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కలెక్టర్, MROలను ప్రజలు పరుగెత్తించి, పరుగెత్తించి కొట్టినట్లు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: హుటాహుటిన ఢిల్లీకి కేటీఆర్.. రేవంత్ కు బిగ్ షాక్? రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో 3 కార్లు ధ్వంసం అయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైతులు ఆహ్వానిస్తేనే అక్కడికి వెళ్లామని తహసీల్దార్ విజయ్ కుమార్ ఆర్టీవీకి చెప్పారు. కొందరు తప్పుడు ప్రచారం చేయడంతోనే ఈ దాడి జరిగిందన్నారు. అభివృద్ధిని స్వాగతించాలి.. అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలన్నారు. 80 శాతం మంది భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మరో 20 శాతం మంది కావాలనే రెచ్చగొడుతున్నారన్నారు. ప్రభుత్వం ఏం చేసినా ప్రజలకు లాభం చేయడం కోసమే చేస్తుందన్నారు. ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని, వాహనాలు దెబ్బతిన్నాయన్నారు. Also Read: Ap Assembly: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఆయనే..! భూ సేకరణకు ప్రయత్నం.. ఈ ప్రాంతంలో ఫార్మా సంస్థ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి దుద్యాల మండలం లగచర్లకు చెందిన రైతులతో సర్కార్ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. అయితే.. కొందరు రైతులు ఫార్మా సంస్థ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ రోజు ఇందుకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని దుద్యాల శివారులో అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడా) స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ లింగనాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తదితరులు అక్కడికి వెళ్లారు. ఇది కూడా చదవండి: BIG BREAKING: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ? అయితే రైతులు ప్రజాభిప్రాయ సేకరణ వద్దకు రాకుండా లగచర్లలోనే ఉన్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్, అధికారులు రైతులు వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. గ్రామం వద్దకు కలెక్టర్, ఇతర అధికారులకు చెందిన వాహనాలు రాగానే రైతులు తీవ్ర ఆగ్రహంతో దాడికి దిగినట్లు తెలుస్తోంది. Also Read: BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు #cm-revanth-reddy #farmers #protest #Pharma Village మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి