/rtv/media/media_files/2025/11/16/fotojet-2025-11-16t111414865-2025-11-16-11-18-05.jpg)
Another encounter in Chhattisgarh
Maoists : మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న అపరేషన్ కగార్‌తో మావోయిస్టులు కుదేలవుతున్నారు. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఛత్తీస్‌గఢ్ అడవులు ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా కాల్పులతో దద్దరిల్లాయి. సుకుమా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరి గుండం అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకోగా ఆ ప్రాంతం మొత్తం తుపాకుల శబ్ధంతో రణరంగంగా మారింది.
కాగా ఈ ఎన్ కౌంటర్ కొనసాగుతుండగా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ సందర్భంగా పోలీసులు ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow Us