తెలంగాణలో కులగణన సర్వే .. మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం తెలంగాణలో త్వరలో కులగణన సర్వే జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఉపాధి ఏంటి ఇలా మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం చేశారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 19 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి తెలంగాణలో త్వరలో కులగణన సర్వే జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వేను ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఉపాధి ఏంటి, ఏడాదికి కుటుంబ ఆదాయం ఎంత ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రజలను అడిగేందుకు రాష్ట్ర ప్రణాళిక శాఖ ముసాయిదాను తయారుచేసింది. ఒక్కో కుటుంబంలోని వారి సమాచారం సేకరించేందుకు మొత్తంగా 60 ప్రశ్నలను రూపొందించారు. ఇందులో సగం కుటుంబ నేపథ్యంపై ఉండగా.. మిగిలిన సగం వ్యక్తిగత వివరాలకు సంబంధించినవి. Also Read: ఓఎల్‌ఎక్స్‌లో ప్రభుత్వ భూమి అమ్మకాలు.. తక్కువ ధరకే ఫ్లాట్లు! తప్పిదాలు లేకుండా చర్యలు ఈ ప్రశ్నల్లో ఏవి అవసరమో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో బీసీ కులాల వారు ఎందరనే లెక్కల కొసమే రేవంత్ సర్కార్ ఈ సర్వే చేపట్టింది. వాళ్లతో పాటుగా రాష్ట్ర ప్రజల్లో ప్రతీ ఒక్కరం కులం, ఉపకులం ఏంటి, స్థానికంగా కులాల పేర్లలో ఏమైనా మార్పులు జరిగాయా ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరిస్తారు. ఎవరిదైనా కులం పేరు తప్పుగా నమోదైతే భవిష్యత్తులో అనేక రకాలుగా నష్టం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. తప్పుడు వివరాలు నమోదు కాకుండా స్థానిక అధికారులు పటిష్ఠంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. Also Read: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు.. కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగానే భవిష్యత్తులో సంక్షేమ పథకాలతో పాటు అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ప్రతీ ఒక్కరి ఆధార్ కార్డు, పాన్ కార్డ్, మొబైల్ నంబర్లతో పాటు వివిధ వివరాలను నమోదు చేస్తారు. విద్యార్హత, ఉద్యోగం, సొంత ఇల్లు, కారు , బైకు వంటివి ఉన్నాయా అని ఇలా పూర్తి సమాచారాన్ని సేకరించనున్నారు. జనాభా లెక్కలకన్నా ఎక్కువ సమాచారాన్ని ఈ సర్వే నుంచి ప్రభుత్వం సేకరించనున్నట్లు తెలుస్తోంది. Also Read: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు! 1.10 కోట్లుకు పైగా కుటుంబాలు తెలంగాణలో ప్రస్తుతం 3.80 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. మొత్తం కుటుంబాల సంఖ్య 1.10 కోట్లు దాటి ఉంటుందని అంచనా. దీనికి తగ్గట్టుగానే సిబ్బంది నియామకానికి ప్రణాళికశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. అయితే ప్రతీ 150 కుటుంబాలకు ఓ సర్వే గణకుడిని నియమిస్తారు. ఈ లెక్కన చూసుకుంటే మొత్తం 75 వేల మంది అవసరం ఉంటుంది. వీళ్లపై పర్యవేక్షకులుగా మరో 15 వేల మంది వరకు అవసరం అవుతుంది. ఇందుకోసం వీళ్లందరినీ నియమించేందుకు అన్ని శాఖల సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఉపాధ్యాయులను ఇలాంటి సర్వేలకు పంపించొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖలోనే టీచర్లు కాకుండా 15 వేల మంది ఇతర ఉద్యోగులను ఈ సర్వే కోసం నియమించనున్నారు. ప్రతీ ప్రభుత్వశాఖలో ఎంతమందిని తీసుకోవాలనేది జిల్లాలవారీగా వివరాలు పంపాలని కలెక్టర్లకు సూచనలు చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో చూసుకుంటే కోటికి పైగా జనాభా ఉన్నారు. దీంతో ఇక్కడే 30 వేల మందికి పైగా గణకులు అవసరమవుతారని అధికారులు భావిస్తున్నారు. Also Read: సల్మాన్ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్ 60 రోజుల్లో పూర్తి చేయాలి జిల్లాల్లో కుటుంబాల సంఖ్య ఆధారంగా కనీసం 2500 నుంచి 3 వేల మంది ఉద్యోగులను అన్నిశాఖల నుంచి ఈ సర్వే కోసం పంపిస్తారు. వీళ్లందరూ కూడా 15 రోజుల పాటు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారు. ఒకసారి సర్వే పూర్తయ్యాక వివరాలు పక్కాగా సేకరించారా లేదా అని కూడా ఆ తర్వాత తనిఖీ సర్వే కూడా చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ నెలఖారులోగా సర్వేను ప్రారంభించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం 60 రోజుల్లోగా సర్వే నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. #telugu-news #telangana-news #telangana #survey #caste-census మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి