కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు..

ఎయిర్ ఇండియాతో పాటు మరో మూడు ఎయిర్‌ లైన్స్‌కి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇటీవల దుబాయ్ నుంచి జైపూర్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కి బెదిరింపులు రాగా.. అధికారులు వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి తనిఖీలు నిర్వహించారు.

New Update
Air India: ఎయిర్‌ఇండియాకు మరోసారి షాక్‌.. భారీ ఫైన్ విధింపు.. ఎందుకంటే?

Bomb Threats: ఎయిర్ ఇండియా విమానానికి వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. 24 గంటల్లో మూడు విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. విమానాలకు బాంబు బెదిరింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా 189 ప్రయాణికులతో దుబాయ్ నుంచి జైపూర్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.

ఇది కూడా చూడండి: Rotten Chicken: స్పెషల్ చికెన్‌.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!

ఎమర్జెన్సీ ల్యాండింగ్..

బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అధికారులు వెంటనే విమానాన్ని జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ క్రమంలో అధికారులు విమానాన్ని తనిఖీ చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఈ మధ్య కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు అధిమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అసలు ఈ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నవారిని పట్టుకుని తప్పకుండా శిక్షిస్తామని ప్రభుత్వం తెలిపింది. 

ఇది కూడా చూడండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!

ఇంకో వైపు బెంగళూరు నుంచి ముంబాయికి వెళ్లడానికి సిద్ధమైన ఆకాశ ఎయిర్‌లైన్స్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అధికారులు అప్రమత్తయ్యారు. కానీ ఎలాంటి అనుమానస్పద వస్తువులు లేవు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్తున్న విమానానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విమానంలో కూడా చెక్ చేయగా ఎలాంటి అనుమానస్పద వస్తువులు లభించలేదు. 

ఇది కూడా చూడండి: సల్మాన్‌ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్

ఇదిలా ఉండగా ఇటీవల ముంబై నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని భద్రత కారణాల దృష్ట్యా న్యూఢిల్లీకి మళ్లించారు. న్యూయార్క్‌లోని జేఎఫ్ కే విమానాశ్రయానికి AI-119 అనే విమానం ముంబై నుంచి బయలు దేరిన రెండు గంటల తర్వాత బెదిరింపులు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి తనిఖీలు నిర్వహించారు.

ఇది కూడా చూడండి: TN: గవర్నర్‌‌ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్

Advertisment
Advertisment
తాజా కథనాలు