/rtv/media/media_files/2024/11/15/F7eobRGKF62wJ5dazIwH.jpg)
Posani Krishna Murali arrest
టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్ తగిలింది. రైల్వే కోడూరు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో పోసానిని గురువారం దాదాపు 9 గంటల పాటు విచారించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆయన్ను విచారించారు.
Also Read: Ravi Praksh: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
అనంతరం అక్కడ నుంచి నిన్న రాత్రి 9.30 గంటలకు పోలీసులు రైల్వేకోడూరులోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ రాత్రి 9.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. అదే సమయంలో పోలీసుల తరఫు లాయర్లు రిమాండ్ రిపోర్టును కోర్టుకి సమర్పించారు. పోసాని కృష్ణమురళిని 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్టులో కోరారు.
Also Read: AP: ఓబులవారి పల్లె పీఎస్ ముగిసిన పోసాని విచారణ
మరోవైపు పోసాని తరఫున దాదాపు 20 మందికి పైగా లాయర్లు కోర్టుకు హాజరయ్యారు. ఇందులో భాగంగా పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. ఈ మేరకు పోసానికి బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. దీంతో పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. కోర్టు తీర్పుతో పోసాని మార్చి 13 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. కాగా ఏపీ పోలీసులు ఇటీవల పోసాని కృష్ణమురళిని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!
ఏం జరిగిందంటే?
పోసాని కృష్ణ మురళి గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు నెట్టింట పలు వీడియోలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో సైతం వారిపై అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ.. పోసానిపై పోలీసు స్టేషన్‌లలో పలు కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. రాయచోటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆయనపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. మరోవైపు పోసానిని పోలీసులు తీసుకెళ్లడంతో ఆయనకి సంబంధించిన పలు వీడియోలను టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతంలో అతడు చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశించి మాట్లాడిన వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.