SIT Notices : కేసీఆర్‌కు సిట్ నోటీసులు..రాష్ట్రంలో ఏం జరగబోతుంది?

రాజకీయ కాక రేపుతున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో పోలీసులు బిగ్‌ ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులిచ్చింది. ఈ కేసులో కేసీఆర్‌ను సిట్ విచారించనుంది. 65 ఏళ్లు పైబడడంతో ఆయన నివాసంలోనే కేసీఆర్ ను విచారించనున్నారు.

New Update
kcr

SIT notices to KCR..what will happen in the state?

SIT Notices : రాష్ట్రంలో రాజకీయ కాక రేపుతున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో పోలీసులు బిగ్‌ ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులిచ్చింది. ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ను సిట్ విచారించనుంది. 65 ఏళ్లు పైబడిన వ్యక్తి కావడంతో ఆయన నివాసంలోనే సిట్ అధికారులు కేసీఆర్‌ను విచారించనున్నారు. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఈ నెలాఖరున సిట్‌ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో కేసీఆర్‌ను అరెస్టు చేయబోతున్నారా..! రేవంత్ ప్రభుత్వం ప్లాన్ ఏంటి..? అసలు కేసీఆర్‌కు నోటీసుల వెనుక ఉన్న సీక్రెట్‌ ఏంటన్నదానిపై ఇప్పుడు రాష్ట్ర  రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Also Read: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

నిజానికి మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులివ్వడంతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్లైమాక్స్‌కు చేరినట్లయింది. ఈ కేసులో ఇటీవలే బీఆర్‌ఎస్‌ టాప్‌ లీడర్లయిన కేటీఆర్‌, హరీష్‌రావు, సంతోష్‌రావులను విచారించారు. ఓ ఛానల్ అధినేతను సైతం పోలీసులు విచారించారు. కేంద్రమంత్రి బండి సంజయ్, మల్కాజ్‌గిరి ఈటల రాజేందర్‌, పీసీసీ చీఫ్ మహేష్‌ గౌడ్‌ స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశారు. తాజాగా కేసీఆర్‌కు కూడా నోటీసులు అందాయి. కేసీఆర్‌ హయాంలో స్పెషల్‌బ్రాంచ్‌ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసి ట్యాపింగ్‌ కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు లాంటి అధికారులు విచారణలో సిట్‌కు కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. పెద్దాయన ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాప్ చేశామని వారంతా  స్టేట్‌మెంట్‌లు ఇచ్చినట్లు సిట్ చెబుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పెద్దాయన అంటే కేసీఆరే అయినందున ఆయనకు సిట్‌ నోటీసులిచ్చినట్టు సమాచారం.

Also Read: ‘సీతా రామం 2’ కాదు.. కొత్త సినిమా కూడా కాదు: మృణాల్ - దుల్కర్ క్రేజీ వీడియో చూసేయండి!

గతంలో ఈ కేసులో విచారణకు హాజరైన పోలీసు అధికారులు ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న తాము ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఒప్పుకున్నారని, వారి స్టేట్‌మెంట్‌ల మేరకే బీఆర్‌ఎస్‌ నేతలను విచారిస్తున్నామని సిట్ టీమ్‌ చెబుతోంది. ఈ కేసులో త్వరలో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని చెబుతున్నారు అధికారులు. మరోపక్క  ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ నేతల అరెస్టులు ఉండవని ధీమాగా ఉంది బీఆర్‌ఎస్‌ పార్టీ. ఒకవేళ తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తే సింపతీ పెరిగి పొలిటికల్‌ హీరోలుగా మారతారని ప్రభుత్వం భయపడుతుండడమే బీఆర్‌ఎస్‌ నేతల ధీమాకు కారణంగా తెలుస్తోంది. మరీ అవసరమైతే బీఆర్‌ఎస్‌ హయాంలో కీలక హోదాల్లో ఉన్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, హోం సెక్రటరీ రవి గుప్తాల పేర్లను విచారణలో ఇరికిస్తామని చెబుతున్నారు.

Also Read: తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటింపు: 2016-2022.. ‘జై భీమ్’ సినిమా హవా

ఫోన్ ట్యాపింగ్‌ డీజీపీ, హోం సెక్రటరీల ఆదేశాల మేరకే జరుగుతాయని గులాబీ  లీడర్లు చెబుతున్నారు. ఇందులో పొలిటికల్ లీడర్ల ప్రమేయం ఉండదనేది వారి వాదన. ఐజీ ప్రభాకర్ రావు రీ రిక్రూట్‌మెంట్‌ నిర్ణయం కూడా DGP, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ సంతకాల మేరకే జరిగిందని బీఆర్‌ఎస్‌ నేతలంటున్నారు. నిర్ణయాలు తీసుకుని, సంతకాలు చేసిన అధికారులకు నోటీసులు ఇవ్వకుండా ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో విచారణ పూర్తి కాబోదనేది బీఆర్‌ఎస్‌ వాదన. అధికారులను పక్కనపెట్టి మిగిలిన వారికి నోటీసులు ఇవ్వడం సెలక్టివ్ ఇన్వెస్టిగేషన్ అవుతుందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే పెద్దాయనకు ఇచ్చిన నోటీసులకు పెద్దగా ఫలితం ఉండకపోవచ్చని బీఆర్‌ఎస్‌ నేతలు లెక్కలేసుకుంటున్నారు. అప్పటి సర్కారులో ఆదేశాలు ఇచ్చిన చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ మహేందర్ రెడ్డి, హోం సెక్రటరీ రవి గుప్తాను విచారించి వారిపై చర్యలు తీసుకోవాలని విచారణలో కేసీఆర్‌ వాదించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు