Tamil Nadu State Film Awards: తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటింపు: 2016-2022.. ‘జై భీమ్’ సినిమా హవా

తమిళనాడు ప్రభుత్వం 2016-2022 సంవత్సరాల స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 13న చెన్నైలో అవార్డుల ప్రదానం జరగనుంది. ఈ అవార్డుల్లో ‘జై భీమ్’ సినిమా ఏడు విభాగాల్లో గెలిచి హైలైట్‌గా నిలిచింది.

New Update
Tamil Nadu State Film Awards

Tamil Nadu State Film Awards

Tamil Nadu State Film Awards: తమిళనాడు ప్రభుత్వం 2016 నుంచి 2022 వరకు విడుదలైన సినిమాలకు సంబంధించిన స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ను అధికారికంగా ప్రకటించింది. సినిమాలతో పాటు టెలివిజన్ రంగానికి చెందిన కళాకారులకు కూడా స్టేట్ టీవీ అవార్డ్స్‌ను ప్రకటించారు.

ఈ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 13న సాయంత్రం 4:30 గంటలకు చెన్నైలోని కళైవాణర్ అరంగంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.

ఈ జాబితాలో హీరోలుగా ధనుష్, విజయ్ సేతుపతి, సూర్య, కార్తి, ఆర్య, విక్రమ్ ప్రభు, ఆర్. పార్థిబన్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు.
ఉత్తమ నటీమణులుగా నయనతార, కీర్తి సురేశ్, జ్యోతిక, అపర్ణా బాలమురళి, లిజోమోల్ జోస్, సాయి పల్లవి అవార్డులు అందుకోనున్నారు.

‘జై భీమ్’ సినిమా హవా

ఈ అవార్డుల్లో సూర్య(Hero Surya) హీరోగా నటించిన ‘జై భీమ్’(Jai Bhim) సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2021లో విడుదలైన ఈ చిత్రం ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులు గెలుచుకొని సంచలనం సృష్టించింది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటి, విలన్, సహాయ నటుడు, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు విభాగాల్లో ఈ సినిమాకు పురస్కారాలు దక్కాయి.

సంవత్సరం వారీగా ముఖ్య అవార్డులు

2016

ఉత్తమ చిత్రం: మానగరం

ఉత్తమ నటుడు: విజయ్ సేతుపతి

ఉత్తమ నటి: కీర్తి సురేశ్

2017

ఉత్తమ చిత్రం: ఆరం

ఉత్తమ నటుడు: కార్తి

ఉత్తమ నటి: నయనతార

2018

ఉత్తమ చిత్రం: పరియేరుమ్ పెరుమాల్

ఉత్తమ నటుడు: ధనుష్

ఉత్తమ నటి: జ్యోతిక

2019

ఉత్తమ చిత్రం: అసురన్

ఉత్తమ నటుడు: ఆర్. పార్థిబన్

ఉత్తమ నటి: మంజు వారియర్

2020

ఉత్తమ చిత్రం: కూజంగల్

ఉత్తమ నటుడు: సూర్య

ఉత్తమ నటి: అపర్ణా బాలమురళి

2021

ఉత్తమ చిత్రం: జై భీమ్

ఉత్తమ నటుడు: ఆర్య

ఉత్తమ నటి: లిజోమోల్ జోస్

2022

ఉత్తమ చిత్రం: గార్గి

ఉత్తమ నటుడు: విక్రమ్ ప్రభు

ఉత్తమ నటి: సాయి పల్లవి

తమిళ సినిమా పరిశ్రమలోని ప్రతిభను గౌరవిస్తూ ప్రకటించిన ఈ స్టేట్ అవార్డులు, నటీనటులు, చిత్రబృందాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా ‘జై భీమ్’ సినిమా సాధించిన ఘన విజయం ఈ అవార్డుల్లో హైలైట్‌గా నిలిచింది.

Advertisment
తాజా కథనాలు