Raja Saab OTT: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీలోకి వస్తోంది. ఈ హారర్ ఫాంటసీ మూవీ జియో హాట్‌స్టార్‌లో 2026 ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల అవుతుంది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ వచ్చిన ఈ సినిమాకు ఓటీటీ మంచి అవకాశంగా మారింది.

New Update
Raja Saab OTT

Raja Saab OTT

Raja Saab OTT: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన తాజా సినిమా ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ ఫాంటసీ మూవీ, భారీ తారాగణం, పెద్ద బడ్జెట్ ఉన్నప్పటికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.

ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే 2026 ఫిబ్రవరి 6 నుంచి ‘ది రాజా సాబ్’ ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

Also Read: ‘సీతా రామం 2’ కాదు.. కొత్త సినిమా కూడా కాదు: మృణాల్ - దుల్కర్ క్రేజీ వీడియో చూసేయండి!

ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే హిందీ వెర్షన్ మాత్రం ఈ ప్లాట్‌ఫామ్‌లో ఉండదని సమాచారం.

థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, అభిమానులకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి. ఓటీటీలో ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటింపు: 2016-2022.. ‘జై భీమ్’ సినిమా హవా

ఈ సినిమాలో హీరోయిన్లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్, వీటీవీ గణేష్, సత్య, సప్తగిరి కనిపించారు.

ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. సంగీతం తమన్ అందించారు. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, హారర్ అంశాలను కలిపి ఈ సినిమాను రూపొందించారు. ప్రభాస్ ఈ చిత్రంలో మాస్ ఎంటర్‌టైనర్ తరహా పాత్రలో కనిపించారు.

థియేటర్ల రన్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీ విడుదలపైనే ఉంది. డిజిటల్‌లో ఈ సినిమా కొత్తగా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.

Advertisment
తాజా కథనాలు