Komatireddy Venkat Reddy: మా సోదరుడికి మంత్రి పదవి నా చేతిలో లేదు..కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు
తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి ఇచ్చే స్టేజీలో తను లేనని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు పార్టీ పెద్దలు మాటిచ్చిన విషయం తనకు తెలియదన్నారు. మంత్రిపదవుల విషయంలో హైకమాండ్, ముఖ్యమంత్రిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.