Breaking news : కవితపై సంచలన ఆరోపణలు..రూ.2వేల కోట్ల విలువచేసే భూ కబ్జా ?

తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నకల్వకుంట్ల కవితపై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి.  హైదరాబాద్ బాలానగర్ మండల పరిధిలోని ఐడీపీఎల్ (IDPL)కు చెందిన ప్రభుత్వ భూమిలో రూ.2 వేల కోట్ల విలువ చేసే భూమిని కవిత భర్త కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి.

New Update
Kavitha, husband

Kavitha and husband anil

Kalvakuntla Kavitha: బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ అయి తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేసీఆర్‌ తనయురాలు కల్వకుంట్ల కవితపై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి.  హైదరాబాద్ బాలానగర్ మండల పరిధిలోని ఐడీపీఎల్ (IDPL)కు చెందిన ప్రభుత్వ భూమిలో భారీ భూకబ్జా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్, ఏవీ రెడ్డి లు ఈ వ్యవహారంలో భాగస్వాములని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Also Read: ఐక్యరాజ్యసమితిని తప్పుబట్టిన విదేశాంగ మంత్రి.. UNOపై విమర్శలు గుప్పించిన జైశంక‌ర్

ఈ విషయమై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసిన బాధితులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తప్పుడు పత్రాలు సృష్టించి బాలానగర్ మండలంలోని సర్వే నంబర్ 2010/4లోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కవిత కబ్జా చేశారని వారు ఆరోపించారు. స్థానికులు చేసిన ఫిర్యాదు ప్రకారం.. ఈ భూమి విలువ సుమారు ₹2,000 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక భూబదిలీ జరిగిందని , దీంట్లో కవిత భర్త అనిల్ కుమార్ , ఏవీ రెడ్డి ప్రత్యక్షంగా ఉన్నారని వారు చెబుతున్నారు. కూకట్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయ పరిధిలో ఉన్న ఈ భూమి కవిత భర్త అనిల్ పేరుతో నమోదైందని, అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని వారు తెలిపారు. ఇప్పటికే ఫ్లాట్లు నిర్మించి అమ్మకాలు మొదలయ్యాయని వారు ఈటల దృష్టికి తీసుకెళ్లారు.
 
కవిత భర్త అనిల్,ఏ వీ రెడ్డిలు ఓవర్‌లాపింగ్ సర్వే నంబర్లను ఆధారంగా చేసుకుని భూకబ్జా జరిపారని స్థానికులు ఆరోపించారు. ఇందులో ఏవీ రెడ్డి కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై“మేము హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, కలెక్టర్‌ వంటి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదు” అని స్థానికులు ఆరోపిస్తున్నారు.. ఈ భూమిని కాపాడి, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి ప్రజోపయోగ నిర్మాణాలకు వినియోగించాలని వారు ఈటల రాజేందర్‌ను కోరారు. వారి ఫిర్యాదు స్వీకరించిన ఈటల రాజేందర్, ప్రభుత్వ భూమిని కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

కాగా బీఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చి ‘జాగృతి’ పేరిట ప్రజల్లోకి వెళ్తున్న ఈ సమయంలో, కవితపై భూకబ్జా ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఫిర్యాదుల వెనుక ఈటల రాజేందర్ వ్యూహం ఉందా అనే ప్రశ్న కూడా చర్చనీయాంశంగా మారింది. తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న వ్యవహారం కావడంతో ఆయన సీరియస్ గా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలానగర్ భూకబ్జా వ్యవహారం త్వరలోనే పెద్ద రాజకీయ తుఫాన్‌కు దారితీయవచ్చని అంచనా వేస్తున్నారు. కవిత, అనిల్, ఏవీ రెడ్డి పేర్లు ఈ వ్యవహారంలో వినిపించడం తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది.

Also Read: High Paying Jobs: ఫ్రెషర్లకు బెస్ట్ ఆప్షన్స్.. ఈ 5 ఉద్యోగాలకు లక్షల్లో జీతం.. అనుభవం అవసరమే లేదు!

Advertisment
తాజా కథనాలు