High Paying Jobs: ఫ్రెషర్లకు 5 బెస్ట్ జాబ్స్.. లక్షల్లో జీతం.. అనుభవం అవసరమే లేదు.. ఓ లుక్కేయండి!

ఫ్రెషరల్ గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్న వారికి Software Development Engineer, డేటా అనలిస్ట్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ సపోర్ట్ / డెవ్‌ఆప్స్ ఇంజనీర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ విశ్లేషకుడు, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ విభాగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి.

New Update
japan

ఇప్పుడు యువత ఆలోచనలు మారిపోయాయి. కాలేజీ నంచి డిగ్రీ పట్టా అందుకున్న వెంటనే ఉద్యోగం చేయాలని అనేక మంది భావిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో ఫ్రెషర్లకు వాళ్ల టాలెంట్ ఆధారంగా మంచి జీతంతో కూడిన ఉద్యోగావకాశాలు ఉన్నాయి. మీరు కూడా ఫ్రెషర్ గా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ 5 ఉద్యోగాలపై లో లుక్కేయండి. 

1. (Software Development Engineer – SDE) (SDE): 

సాఫ్ట్ వేర్ డవలప్మెంట్ ఇంజనీర్ ఎవర్ గ్రీన్ ఉద్యోగం అని చెప్పాలి. మీకు మంచి కోడింగ్ నైపుణ్యం ఉండి, ఈ ఉద్యోగంతో కెరీర్ ప్రారంభిస్తే భవిష్యత్ బాగుంటుంది. 
జీతం: ఈ ఉద్యోగంతో కెరీర్ ప్రారంభించిన వారికి ఏడాదికి రూ. 5 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు జీతం ఉంటుంది. మంచి కోడింగ్ నైపుణ్యాలు కలిగిన IIT/NIT/టాప్ కాలేజీల స్టూడెంట్స్ కు రూ. 25 లక్షలకు పైగా ప్రారంభ జీతం లభించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కావాల్సిన స్కిల్స్: JAVA, Python, C++, data structures తదితర ప్రోగామింగ్ లాంగ్వేజీలపై మంచి పట్టు ఉండాలి..

2. డేటా అనలిస్ట్ / జూనియర్ డేటా సైంటిస్ట్ (Data Analyst / Jr. Data Scientist):

వ్యాపార సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంతో పాటు, భవిష్యత్తు ధోరణులను అంచనా వేయడానికి పెద్ద మొత్తంలో డేటాను విశ్లేషించడం ఈ ఉద్యోగంలో చేరిన వారి విధి. ఈ విభాగంలో ఎంపికైన వారికి ఏడాదికి రూ.4 లక్షల నుండి రూ.10 లక్షల వరకు వేతనం ఉంటుంది.
కావాల్సిన స్కిల్స్:  python r programming, SQL, DBMS, Cognos, Data Mining తదితర టెక్నాలజీలపై పట్టు ఉండాలి.

3. క్లౌడ్ ఆర్కిటెక్చర్ సపోర్ట్ / డెవ్‌ఆప్స్ ఇంజనీర్ (Cloud Support / DevOps)


క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో (AWS, Azure, GCP) అప్లికేషన్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విభాగంలో ఎంపికైన వారికి ఏడాదికి రూ.6 లక్షల నుండి రూ.12 లక్షల వరకు వేతనం ఉంటుంది. 

కావాల్సిన స్కిల్స్: Linux, నెట్‌వర్కింగ్, క్లౌడ్ ప్లాట్‌ఫామ్ సర్టిఫికేషన్‌ కోర్సులు చేసిన వారికి అవకాశం ఉంటుంది. 

4. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ విశ్లేషకుడు / ఈక్విటీ పరిశోధన (Investment Banking / Equity Research):

స్టాక్ మార్కెట్ ధోరణులు, పెట్టుబడులు, లాభాలుపై లోతైన విశ్లేషణ చేసే సామర్థ్యం ఉండాలి. ఈ విభాగంలో ఎంపికైన వారికి ఏడాదికి రూ.8 లక్షల నుండి రూ.18 లక్షల వరకు వేతనం ఉంటుంది.
కావాల్సిన స్కిల్స్: అకౌంటింగ్ పరిజ్ఞానం, Microsoft Excel నైపుణ్యం, ఎక్కువ గంటలు పని చేయగల సామర్థ్యం ఉండాలి

5. డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ (Digital Marketing Specialist):

SEO, SEM, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ స్ట్రాటజీ ద్వారా ఆన్‌లైన్‌లో బ్రాండ్ ను ప్రమోట్ చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచడం ఈ విభాగంలో ఉద్యోగంలో చేరిన వారు చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగంలో చేరితే సంవత్సరానికి రూ.3 లక్షల నుండి రూ.7 లక్షల వరకు వేతనం ఉంటుంది. బోనస్ లు కూడా ఈ ఉద్యోగంలో ఎక్కువగా ఉంటాయి. 
కావాల్సిన స్కిల్స్: Google Analytics, SEO టూల్స్, కంటెంట్ డెవలపై చేయడం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

Advertisment
తాజా కథనాలు