/rtv/media/media_files/2025/08/31/mla-rajasingh-2025-08-31-20-10-40.jpg)
Raja Singh joins BJP
Raja Singh: బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(goshamahal mla raja singh) తెలంగాణ రాజకీయాల్లో(telangana-politics) ఓ సంచలనం. హిందుత్వ ఎజెండాతో ఆయన చేసే వ్యాఖ్యలు జాతీయ మీడియాలోనూ మారుమోగుతుంటాయి. ఇక అంతర్జాతీయ టెర్రరిస్టుల నుండి కూడా ఆయనకు పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. అయితే పార్టీ పెద్దల మీద సంచలన ఆరోపణలు చేసి పార్టీకి దూరమైన రాజాసింగ్ తిరిగి సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినవస్తున్నాయి.
కట్టర్ హిందూత్వ వాదిగా పేరున్న రాజాసింగ్ గత కొంతకాలం క్రితం బీజేపీకి రాజీనామా చేశారు. దాన్ని పార్టీ ఆమోదించింది కూడా. ఆనాటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన తిరిగి కమలం గూటికి తిరిగి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అగ్రనాయకులతో చర్చలు సఫలం అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు ప్రచారం సాగుతోంది. వచ్చే నెలలో కాషాయ కండువా కప్పుకునే ఛాన్స్ ఉందని రాజసింగ్ సన్నిహితులు చెబుతున్నారు. రీ జాయినింగ్ పై ఇప్పటికే జాతీయ నాయకులతో రాజసింగ్ మాట్లాడినట్టు సమాచారం.కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లొచ్చిన రాజాసింగ్ తన టూర్ లో హస్తిన పెద్దలతో లెక్క పక్కా చేసుకొని వచ్చాడని MLA అనుచరులు చెబుతున్నారు.
Also Read : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి కానుకగా అకౌంట్లోకి డబ్బులు
Raja Singh Joins BJP
ఇటీవల బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమితులైన నితిన్ నబీన్ ను రాజాసింగ్ కలిసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ సందర్భంగా తను తిరిగి సొంతగూటికి రావాలనుకుంటున్న విషయాన్ని పార్టీ ముఖ్యుల వద్ద ప్రస్థావించినట్లు తెలిసింది. దీనికి పార్టీ పెద్దలు కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలోనే ఆయన తిరిగి కాషాయం కండువ కప్పుకునే అవాకాశం ఉందని తెలుస్తోంది.
అసంతృప్తితో రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేయడం, దాన్ని పార్టీ ఆమోదించడం చకాచకా జరిగిపోయాయి. అయితే గతంలోనూ రాజాసింగ్ పార్టీ లైన్ దాటి చేసిన పరుష వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని బీజేపీ ఆయన్ను సస్పెండ్ చేసింది. గత శాసనసభ ఎన్నికల ముందే తిరిగి పార్టీలోకి తీసుకుని గోషామహల్ టికెట్‌ను బీజేపీ రాజాసింగ్‌కు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో రాజాసింగ్ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తిరిగి ఇదే కథ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం కావచ్చు. తిరిగి బీజేపీలోనే ఎన్నికల ముందు చేరి గోషామహల్ నుండి పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే గోషామహల్‌లో రాజాసింగ్‌ను మించి బలమైన అభ్యర్థి బీజేపీకి దొరికే అవకాశం లేదనే చెప్పాలి.
కాగా, రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గంలో పట్టున్న నేత. బీజేపీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇది పార్టీ గుర్తింపుతో కాకుండా, నియోజకవర్గంలో ఆయనకున్న సొంత బలంగానే చూడాలి. రాజాసింగ్ 2009లో టీడీపీ నుండి జీహెచ్‌ఎంసీలోని మంగళ్‌హాట్‌లో కార్పొరేటర్‌గా గెలిచారు. 2014 వరకు అదే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఏ పార్టీ మారినా తన హిందుత్వ సిద్ధాంతాలను మాత్రం వదులుకోలేదు. ఇదే రాజాసింగ్ బలంగా చెప్పవచ్చు. బీజేపీలో ఉన్న అంతర్గత గొడవల కారణంగానే ఆయన బయటకు వచ్చారు. రాజాసింగ్‌కు పార్టీ గుర్తింపు కాకుండా హిందుత్వవాదిగా మంచి గుర్తింపు ఉంది. తన సొంత బలంతో వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిచే అవకాశాలు లేకపోలేదు. అందుకే బీజేపీ తిరిగి అతన్ని పార్టీలోకి తీసుకోవాలని భావిస్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ, మోదీ పట్ల తన విధేయత చెక్కుచెదరలేదని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని స్పష్టం చేశారు. దీంతో ఆయన సొంత గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది.
Also Read : TGSRTC : నిరుద్యోగులకు శుభవార్త..ఆర్టీసీలో ఉద్యోగాలు
Follow Us