వాళ్లు తిన్నాకే విద్యార్థులు తింటారు: పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు

పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి బుధవారం మాగనూరు హైస్కూల్‌కు వెళ్లారు. ఇకనుంచి ప్రతిరోజూ కూడా ఉపాధ్యాయుల కమిటీ, విద్యార్థులతో కూడిన ఆహార కమిటీ సభ్యులు తిన్నాకే విద్యార్థులకు భోజనం వడ్డించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

New Update
FOOD

నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురైన ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారించిన హైకోర్టు కూడా దీనిపై సీరియస్ అయ్యింది. అధికారులు నిద్రపోతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి బుధవారం ఈ స్కూల్‌కు వెళ్లారు. మధ్నాహ్న భోజనం, బియ్యం, కూరగాయలు, తాగునీటిని ఆయన పరిశీలించారు. స్కూల్‌లో ఫుడ్ శాంపిల్స్‌ను సేకరించి విశ్లేషించాలని, పాఠశాల బయట అమ్ముతున్న చిరుతిళ్లను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.   

Also Read: కులగణన సర్వే.. రేవంత్‌ ప్రభుత్వానికి కవిత కీలక డిమాండ్లు

విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ధైర్యం నింపేందుకే తాను పాఠశాలకు వచ్చినట్లు పేర్కొన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశానని, ఆహారం బాగుందన్నారు. ఇకనుంచి ప్రతిరోజూ కూడా ఉపాధ్యాయుల కమిటీ, విద్యార్థులతో కూడిన ఆహార కమిటీ సభ్యులు పర్యవేక్షించేలా, సభ్యులు తిన్నాకే విద్యార్థులకు భోజనం వడ్డించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు.    

Also Read: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం- కేటీఆర్

ఇదిలాఉండగా.. మాగనూరు పాఠశాలలో కలుషిత ఆహార ఘటనను నిరసిస్తూ బుధవారం విద్యార్థి సంఘాల నాయకులు మాగనూరు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఇటీవల మాగనూర్ హైస్కూల్‌లో మధ్నాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఆ తర్వాత అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. మంగళవారం మధ్నాహ్న భోజనం తిన్న విద్యార్థులు తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో వాంతులు చేసుకున్నారు. దీంతో ఉపాధ్యాయులు వారిని స్థానికి పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయించారు. 29 మందిలో ఏడుగురు కోలుకోగా.. మిగిలిన 22 మందిని మక్కల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.  

Also Read: మతం మారి ఆ రిజర్వేషన్లు పొందడం రాజ్యంగాన్ని మోసం చేయడమే: సుప్రీంకోర్టు

Also Read: త్వరలో ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి.. భట్టి సంచలన ప్రెస్ మీట్!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు