కులగణన సర్వే.. రేవంత్‌ ప్రభుత్వానికి కవిత కీలక డిమాండ్లు

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, కులగణన కోసం ఏర్పాటు చేసిన డిడికేటెడ్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్వంతంత్రత ఇవ్వాలని, అన్నీ వసతులు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
KAVITAAA

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, కులగణన కోసం ఏర్పాటు చేసిన డిడికేటెడ్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్వంతంత్రత ఇవ్వాలని, అన్నీ వసతులు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కులగణనపై బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటిని ప్రభుత్వం నివృత్తి చేయాలన్నారు. 55 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఇప్పటిదాకా కులగణన ఎందుకు చేపట్టలేదో రాహుల్‌గాంధీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, కులగణనకు సంబంధించిన అంశాలపై సలహాలు, సూచనలు చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిపోర్టును డిడికేటెడ్‌ కమిషన్‌ను సోమవారం అందించారు. 

Also read: లవర్స్ మధ్య చిచ్చు పెట్టిన నాన్‌ వెజ్.. ఒకరు మృతి.. అసలేమైందంటే?

కులగణనకు బీజేపీ వ్యతిరేకమని.. 2021లోనే దీనిపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ డీఎన్‌ఏలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలపై వ్యతిరేక భావాలున్నాయని మండిపడ్డారు. మరోవైపు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, ప్రతీ సంవత్సరం రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని కాంగ్రెస్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కులగణన, రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌కు అసలు ఎలాంటి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కేవలం రాజకీయ రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం కాకుండా బీసీలకు సంబంధించిన అన్ని అంశాలపై రాష్ట్ర సర్కార్‌కు సిఫారుసులు చేయాలని కమిషన్‌ను కోరారు. అలాగే కామారెడ్డి డిక్లరేషన్‌ను యథాతథంగా అమలు చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

కులగణనకు సంబంధించి రాష్ట్రంలో స్టిక్కర్లు వేయని ఇళ్లు 70 శాతం ఉన్నాయని, అత్యధిక జనాభా ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో అసలు సర్వేనే పూర్తి కాలేదన్నారు. కానీ ప్రభుత్వం 90 శాతం సర్వే ఎలా పూర్తయిందని చెబుతోందంటూ ప్రశ్నించారు. అలాగే సర్వే వివరాల కంప్యూటరైజేషన్ 7 శాతం కూడా పూర్తి కాలేదన్నారు.  

Also Read: వావ్.. 'త్వరలో గంటకు 280 కి.మీ వేగంతో నడిచే రైళ్లు'

నివేదికలో కీలక డిమాండ్లు ఇవే 

1.తెలంగాణలో కులగణనకు శాస్త్రీయంగా నిర్వహించి.. జాతీయ స్థాయిలో కూడా జనభా గణనలో భాగంగా కులగణన చేపట్టేలా సిఫార్సు చేయాలి
2. బీసీ సామాజిక వర్గానికి దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం, అలాగే విద్యా, ఉద్యోగ అవకాశాల్లో కూడా ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లు పెంచేలా సిఫార్సు చేయాలి
3. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదన చేయాలి.
4. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేలా, మహిళా రిజర్వేషన్‌ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటాను తీసుకొచ్చేలా కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచన చేయాలి.   
5. బీసీ విద్యార్థులకు ఫీజు రియెంబర్స్‌మెంట్ నిరాటంకంగా అందించేలా, అలాగే విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే బీసీ విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేలా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిపార్సు చేయాలి. 
6. ఇప్పటికీ కూడా విద్య, ఉద్యోగ ఆర్థిక, రాజకీయాల్లో కనీస ప్రాతినిథ్యం కూడా దక్కని కులాలకు వాళ్ల జనాభా దామాషా ప్రకారం.. ప్రయోజనాలు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కమిషన్ సూచించాలి. 
7. ప్రతీ ఆర్థిక సంవత్సరం తప్పనిసరిగా బీసీ సబ్‌ ప్లాన్ అమలు చేసేలా ప్రభుత్వాలకు కమిషన్‌ సిఫార్సు చేయాలి
8. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పెంచేందుకు ఉపయోగపడే డెడికేటెడ్ కమిషన్‌ రిపోర్టును కూడా రూపొందించాలి.  
స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు దోహదపడేలా డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక రూపొందించాలి.
9. ఎంబీసీ, సంచార జాతుల వారి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసేలా ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేయాలి.
10. సంచార జాత్తల వారికి స్థిర నివాసాలు, ఉపాధికి ప్రభుత్వం చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేయాలి. 

మరింత సమాచారం కోసం ఈ పీడీఎఫ్‌ చదవండి

Advertisment
Advertisment
తాజా కథనాలు