మతం మారి ఆ రిజర్వేషన్లు పొందడం రాజ్యంగాన్ని మోసం చేయడమే: సుప్రీంకోర్టు ఇతర మత విశ్వాసాలను పాటిస్తూ రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు తాము హిందువులని చెప్పడాన్ని సూప్రీంకోర్టు తప్పుబట్టింది.ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని తేల్చిచెప్పింది. ఓ క్రిస్టియన్ మహిళకు మద్రాస్ హైకోర్టు ఎస్సీ సర్టిఫికేట్ నిరాకరించడాన్ని సమర్థించింది. By B Aravind 28 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇతర మత విశ్వాసాలను పాటిస్తూ.. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు తాము హిందువులని చెప్పడాన్ని సూప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని తేల్చిచెప్పింది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్డ్ క్యాస్ట్ (SC) కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడాన్ని నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఉద్యోగం కోసం ఆ మహిళ తాను హిందువునని చెప్పడాన్ని తప్పుబట్టింది. వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను విశ్వసించడం ముఖ్యమని పేర్కొంది. Also Read: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం- కేటీఆర్ మారుతున్న మతంపై ఎలాంటి నమ్మకం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమైతే పర్మిషన్ ఇవ్వమని తేల్చిచెప్పింది. పిటిషనర్ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నానని, ఆలయాలకు వెళ్తున్నాని చెప్పారు గానీ.. తిరిగి హిందూమతంలో చేరినట్లు ఎక్కడా కూడా ఆధారాలు ఇవ్వలేదని కోర్టు చెప్పింది. రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుందని.. అయినా కూడా ఆమె హిందువునని, ఉద్యోగం కోసం ఎస్సీ సర్టిఫికేట్ కోరుతున్నారని చెప్పింది. ఈ ద్వంద్వ వైఖరిని ఆమోదించలేమని పేర్కొంది. ఇది సామాజిక విలువలకు విరుద్ధమని, రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని తేల్చిచెప్పింది. Also Read: కొత్త పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ ఏంటి? దీని వలన లాభాలేంటి? అయితే ఈ కేసులో పిటిషనర్ సెల్వరాణి అనే మహిళ.. హిందూ తండ్రికి, క్రిస్టియన్ తల్లికి జన్మించారు. మూడేళ్ల వయసులోనే ఆమె బాప్టిజం తీసుకున్నారు. 2015లో ఓ ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను హిందువునని, తన తండ్రి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని చెబుతూ ఎస్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేశారు. దీనిపై విచారణ జరిపిన స్థానిక యంత్రాంగం ఆమె దరఖాస్తును రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె మద్రాసు హైకోర్టులో సవాల్ చేయగా.. అక్కడ కూడా కోర్టు తిరస్కరించింది. చివరికీ సుప్రీంకోర్టులో కూడా ప్రతీకూలంగా తీర్పు వచ్చింది. Also Read: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్ Also Read: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు! #Religious Conversion #reservations #national-news #supreme-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి