Child Abuse: సైదాబాద్‌ జువెనైల్‌ హోం ఘటన..18 కి చేరిన లైంగిక దాడి బాధితుల సంఖ్య

హైదరాబాద్‌ లోని సైదాబాద్‌ జువెనైల్‌ హోంలో బాలురపై జరిగిన లైంగికదాడి విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. జువెనైల్‌ హోం లో స్టాఫ్‌ గార్డ్‌ గా ఉన్న రహమాన్‌ బాలురపై అకృత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. వీరిసంఖ్య 18 కి చేరుకుంది.

New Update
Child Abuse

Child Abuse

Child Abuse: హైదరాబాద్‌ లోని సైదాబాద్‌ జువెనైల్‌ హోంలో బాలురపై జరిగిన లైంగికదాడి విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. జువెనైల్‌ హోం లో స్టాఫ్‌ గార్డ్‌ గా ఉన్న రహమాన్‌ బాలురపై అకృత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. సెలవుపై ఇంటికి వెళ్లిన ఒక బాలుడు తల్లిదండ్రులకు చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో అధికారులు విచారణ చేయగా పలు దిగ్ర్భాంతికర విషయాలు బయటకు వస్తున్నాయి. అధికారుల విచారణలో మొదట 11 మంది బాలలపై రహమాన్‌ లైంగికదాడి చేసినట్లు వెలుగులోకి రాగా తాజా విచారణలో మరో 7 గురు బాధితులు ఉన్నారని తేలింది. దీంతో లైంగికదాడి బాధితుల సంఖ్య 18కి చేరుకుంది. అయితే ఇంకా బాధితులు ఉన్నారనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.

రెండు పోక్సో కేసులు..

ఇప్పటికే నిందితుడిపై రెండు పోక్సో కేసులు నమోదయ్యాయి.అయితే మరో ముగ్గురు బాలురపై కూడా లైంగిక దాడి జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేయగా మొత్తం ఐదు పోక్సో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గడచిన కొన్ని నెలలుగా నిందితుడు రహమాన్‌ 11 మందికి పైగా బాలలను బెదిరించి వారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు అధికారులు విచారణలో గుర్తించారు. కాగా లైంగిక దాడిపై మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు హోంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Jatadhara : ఘోస్ట్ హంటర్ గా సుధీర్ బాబు..  జటాధర ట్రైలర్‌ అదుర్స్!

బాధిత బాలలతో మాట్లాడి కీలక వివరాలు సేకరించారు. విచారణ సందర్భంగా బాలురను రహమాన్‌ హింసిన తీరు తెలుసుకుని పోలీసులు తీవ్రంగా చలించిపోతున్నారు. వారి దర్యాప్తులో మరో ఆరుగురు బాలురపై కూడా దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది. అయితే వీరంతా ప్రస్తుతం హోంలో ఉన్నవారే అని, బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో  పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. హోం నుంచి ఇప్పటికే విడుదలైన బాలలపై కూడ రహమాన్‌ దాడికి పాల్పడ్డాడనే అనుమానంతో విడుదలైన బాలురను  కూడా పిలిపించి సమాచారం సేకరిస్తున్నారు. విచారణ పూర్తయితే బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు రహమాన్‌ను కస్టడీకి తీసుకుని విచారణ చేసేందుకు పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Also Read: పిచ్చి వేషాలు వేస్తే...లోపలికి వెళ్ళి మరీ చంపేస్తాం..హమాస్‌ను హెచ్చరించిన ట్రంప్

Advertisment
తాజా కథనాలు