Jatadhara : ఘోస్ట్ హంటర్ గా సుధీర్ బాబు..  జటాధర ట్రైలర్‌ అదుర్స్!

యంగ్ హీరో సుధీర్‌ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం జటాధర ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు. మైథలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్.. అభిమానులను, సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

New Update
jatadhara

యంగ్ హీరో సుధీర్‌ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం జటాధర ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు. మైథలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్.. అభిమానులను, సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పురాతన నిధిని కాపాడుతున్న ధన పిశాచి, దెయ్యాలను నమ్మని ఘోస్ట్ హంటర్ గా సుధీర్ బాబు పాత్రల మధ్య జరిగే సంఘర్షణ ఆసక్తికరంగా ఉంది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. 

ఆమె ధన పిశాచి పాత్రలో శక్తివంతమైన,  భయంకరమైన విలన్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి కోసం ఒక మహిళ (శిల్పా శిరోద్కర్ పోషించిన పాత్ర) ధన పిశాచిని మేల్కొల్పడం, ఆ పిశాచి ఒక శిశువు బలిని కోరడం, దాన్ని ఆపడానికి సుధీర్ బాబు పోరాడటం ట్రైలర్‌లో కీలకాంశాలుగా ఉన్నాయి. ట్రైలర్‌లో విజువల్స్, నేపథ్య సంగీతం,  నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. 

నవంబర్ 7న విడుదల

వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రాన్ని నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ఉమేష్ కే. ఆర్. బన్సల్,  ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన సోషల్ మీడియా వేదికగా ట్రైలర్‌ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 'జటాధర' ట్రైలర్ అద్భుతంగా ఉందని, సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Advertisment
తాజా కథనాలు