/rtv/media/media_files/2025/11/07/rtc-bus-accident-in-ghatkesar-2025-11-07-15-23-10.jpg)
RTC Bus Accident in Ghatkesar
కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో బస్సు ప్రమాదం జరిగింది. జనగామ నుంచి ఉప్పల్ వస్తున్న ఆర్టీసీ బస్సు డివైడర్‌ను దాటి మరో రూట్‌లోకి దూసుకొచ్చింది. ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఔశపూర్ వద్ద కారును తప్పించబోతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
Also Read: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతిక సమస్య.. 100కు పైగా విమానాలు ఆలస్యం
మరోవైపు శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో ఆరాంఘర్ చౌరస్తా వద్ద మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వెహికిల్ వెనక నుంచి ఢీకొంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. బస్సులో కొందరు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. దీన్ని గమనించిన అక్కడున్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు.
Also Read: టెస్లాలో మస్క్ కు వన్ ట్రిలియన్ ప్యాకేజ్..ఆనందంతో రోబోతో ఎలాన్ డాన్స్
ఇదిలాఉండగా ఇటీవల కర్నూల్‌లో కావేరి ట్రావెల్ బస్సు దగ్ధమైన సంగతి తెలసిందే. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో కూడా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును టిప్పర్ లారీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో కూడా 19 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు.
Also Read: కాల్పుల విరమణ ఊహించని పరిణామం..మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
Follow Us