Delhi airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతిక సమస్య.. 100కు పైగా విమానాలు ఆలస్యం

ఇన్నాళ్లు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే తాజాగా విమానాశ్రయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అందులోనూ దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

New Update
delhi airport

delhi airport Photograph: (delhi airport)

Delhi airport : ఇన్నాళ్లు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే తాజాగా విమానాశ్రయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అందులోనూ దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్‌పోర్టులోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నట్లు విమానయాన వర్గాలు వెల్లడించారు.

విమానశ్రయంలోని ఆటో ట్రాక్‌ సిస్టమ్‌కు సంబంధించిన సమాచారం అందించే ఆటోమెటిక్‌ మెసేజ్ స్విచ్ఛింగ్‌ వ్యవస్థలో సమస్య తలెత్తినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లకు విమాన ప్రణాళికలు ఆటోమెటిక్‌గా అందడం లేదని వివరించాయి. ప్రస్తుతం ఏటీసీ సిబ్బంది మ్యానువల్‌గా విమానాల షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నాయని తెలిపాయి. ఫలితంగా అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని విమానయాన సంస్థ వెల్లడించింది.

 సాంకేతిక సమస్య కారణంగా ఇప్పటివరకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 100కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయని అధికారిక వర్గాలు వివరించాయి. విమానాల షెడ్యూల్‌ మార్పునకు సంబంధించి ఎయిర్‌లైన్లు ఇండిగో, స్పైస్‌జెట్‌, ఎయిరిండియా ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేసినట్లు తెలిపాయి. జరుగుతున్న అసౌకర్యానికి క్షమించాలని కోరాయి. మరోవైపు, ఆలస్యంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులోని చెక్‌ఇన్‌, ఇతర కౌంటర్ల వద్ద భారీ రద్దీ నెలకొనడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని, ఇందుకు కొన్ని గంటల సమయం పట్టొచ్చని అధికారిక వర్గాలు సమాచారం అందించాయి. ఈ సమస్య కారణంగా లఖ్‌నవూ, జైపుర్‌, చండీగఢ్‌, అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టుల్లోనూ విమానాల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలోని అత్యంత రద్దీ విమానాశ్రయంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు పేరుంది. ఇక్కడ రోజుకు దాదాపు 1500లకు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తాయి. అలాంటి విమానశ్రయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 ఇది కూడా చదవండి: కిచెన్‌లో ఈ రెండు కలిపి నిల్వ చేస్తున్నారా..? నాణ్యత, రుచి దొబ్బింది ఎలానో తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు