బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ సిర్పూర్ అసెంబ్లీ స్థానం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సిర్పూర్ నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తే లేదని, అలాంటి వార్తలు అవాస్తమని చెప్పారు. తాను చనిపోయినా ఇక్కడే సమాధి చేయాలని తన కుటుంబ సభ్యులకు చెప్పానని ఆయన అన్నారు. ఈ సీటుపై తనకు ఎలాంటి అపనమ్మకం లేదన్నారు. సిర్పూర్ లో నిర్వహించిన కార్యకర్తల సమక్షంలో ఆర్ఎస్ ఈ కామెంట్స్ చేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేఫథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
Also Read : America-Pakistan: అమెరికా-బిన్ లాడెన్- పాక్..గతం మర్చిపోయారు...జైశంకర్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ నుండే పోటీ
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండే కోనప్ప పోటీ చేసిన సంగతి తెలిసిందే. అదే నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి గారు. దీంతో కోనప్ప 3 వేల ఓట్ల తేడాతో ఓడి పోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ విజయం సాధించారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో నిలవడం వల్లే తన ఓట్లు చీలి ఓడిపోయానని కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్‌లో చేరడంతో కోనప్ప అలిగి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలోనూ ఆయన తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు.
Also Read : GPT‑4b Micro: ఇక మనిషికి చావు ఉండదా?.. వృద్ధులను యువకులుగా మార్చేయనున్న AI
హామీలను అమలు చేయడం లేదని
ఇదిలా ఉండగా గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కొనప్ప కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు హామీలు ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. కానీ ఆ తర్వాత కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం హామీ ఇచ్చినా కౌటాల బ్రిడ్జికి అనుమతి రాలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని కోనప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఐతే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో కోనేరు కోనప్ప ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కోనప్ప కొద్దికాలంగా సొంతంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో తిరిగి ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తోంది.చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read : Kukatpally Sahasra Murder: రూ. 500 పెట్టి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని.. సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు!
BIG BREAKING: నేను ఇక్కడే చస్తా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్!
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ సిర్పూర్ అసెంబ్లీ స్థానం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సిర్పూర్ నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు.