GPT‑4b Micro: ఇక మనిషికి చావు ఉండదా?.. వృద్ధులను యువకులుగా మార్చేయనున్న AI

మానవ జీవితాన్ని పొడిగించేందుకు లక్ష్యంతో పనిచేస్తున్న సిలికాన్ వ్యాలీ స్టార్టప్ కంపెనీ రెట్రో బయోసైన్సెస్‌తో కలిసి ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్‌AI ఒక ప్రత్యేకమైన ఏఐ మోడల్‌ను డెవలప్ చేసింది. దీనికి 'జీపీటీ-4బీ మైక్రో' అని పేరు పెట్టారు.

New Update
Retro Biosciences has yielded GPT‑4b

Retro Biosciences GPT‑4b micro,

GPT‑4b Micro:

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కేవలం వాయిస్ ఓవర్ చెప్పడం, ఫొటోలు, పాటలకే పరిమితం కాకుండా ఇప్పుడు జీవశాస్త్ర రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. మానవ జీవితాన్ని పొడిగించేందుకు( Extend Human Life) లక్ష్యంతో పనిచేస్తున్న సిలికాన్ వ్యాలీ స్టార్టప్(Silicon Valley Startup) కంపెనీ రెట్రో బయోసైన్సెస్‌తో కలిసి ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్‌AI ఒక ప్రత్యేకమైన ఏఐ మోడల్‌ను(New AI Model) డెవలప్ చేసింది. దీనికి 'జీపీటీ-4బీ మైక్రో' అని పేరు పెట్టారు.

Also Read: Vivo V29 Pro 5G అరాచకం.. బడ్జెట్ ధరలో అల్ రౌండర్..!

సాధారణ చాట్‌బాట్‌ల మాదిరిగా కాకుండా, ఈ మోడల్‌ను ప్రత్యేకంగా ప్రోటీన్ల రూపకల్పన కోసం ట్రైనింగ్ ఇచ్చారు. ఇది మానవ శరీరంలోని సెల్ పునరుత్పత్తి ప్రక్రియలో కీలక పాత్ర పోషించే 'యమానకా కారకాల' ప్రోటీన్‌లను తిరిగి రూపొందించగలిగింది. ఈ ప్రోటీన్‌లు సాధారణ కణాలను స్టెమ్ సెల్స్‌గా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ప్రస్తుత పద్ధతుల్లో ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా, తక్కువ సామర్థ్యంతో జరుగుతుంది. ఒక శాతం కంటే తక్కువ కణాలు మాత్రమే స్టెమ్ సెల్స్‌గా మారతాయి. అయితే, ఓపెన్‌ఏఐ, రెట్రో బయోసైన్సెస్ అభివృద్ధి చేసిన 'జీపీటీ-4బీ మైక్రో'(GPT‑4b Micro) ఈ సామర్థ్యాన్ని 50 రెట్లు పెంచిందని ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఏఐ రూపొందించిన ఈ ప్రోటీన్‌లు స్టెమ్ సెల్స్ గుర్తులను వేగంగా వ్యక్తీకరించడంతో పాటు, డీఎన్ఏ దెబ్బతినడాన్ని మరింత సమర్థవంతంగా సరిదిద్దగలవని కనుగొన్నారు. దీనివల్ల వృద్ధాప్య కణాలు కూడా చిన్న కణాలుగా పనిచేయడం ప్రారంభించాయి.

ఈ విప్లవాత్మక ఆవిష్కరణ పునరుత్పత్తి వైద్యంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది. ప్రస్తుతం స్టెమ్ సెల్స్ తయారీకి వారాల సమయం పట్టే ప్రక్రియను ఏఐ వేగవంతం చేస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో అవయవ మార్పిడి, క్షీణించిన వ్యాధులకు చికిత్సలు, వృద్ధాప్య సంబంధిత సమస్యలకు చికిత్సలు మరింత సులభతరం అవుతాయి. ఈ ప్రాజెక్టును ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ రెట్రో బయోసైన్సెస్‌లో చేసిన భారీ పెట్టుబడిలో భాగంగా చూడవచ్చు. ఏఐని ఉపయోగించి శాస్త్రీయ ఆవిష్కరణలను వేగవంతం చేయాలనే లక్ష్యానికి ఇది ఒక నిదర్శనం. అయితే, ఈ పరిశోధన ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. పూర్తిస్థాయిలో క్లినికల్ థెరపీలుగా మారడానికి మరికొంత సమయం పడుతుంది. ఈ ఆవిష్కరణపై శాస్త్రీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు