Kukatpally Case: దెబ్బ తీసిన బ్యాట్ ఈగో.. కళ్లు మూసుకొని కత్తితో పొడిచి..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో నివసించే బాలిక సహస్రను ఓ బాలుడు దారుణంగా హతమార్చాడు.

New Update
mrf bat

Kukatpally Case: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో నివసించే బాలిక సహస్రను ఓ బాలుడు దారుణంగా హతమార్చాడు. క్రికెట్ బ్యాట్ కోసమని బాలిక ఇంటికి వచ్చిన 14 ఏళ్ల మైనర్ బాలుడు బ్యాట్ దొంగిలిస్తుండగా సహస్ర చూసిందని, ఆమె అరవడంతో భయపడి ఆ బాలుడు ఆమెను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. 

Also Read: వాడిని చంపేయండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న కూకట్‌పల్లి బాలిక తండ్రి ఆవేదన!

హాలీడేస్ ల్లో గల్లీలో పిల్లలందరూ కలిసి క్రికెట్‌ ఆడేవారు. అయితే  కొన్ని రోజుల క్రితం సహస్ర సోదరుడు తీసుకువచ్చిన  బ్యాట్‌ నచ్చిన నిందితుడికి బాగా నచ్చింది. తానొకసారి ఆడి ఇస్తానని నిందితుడు అడగ్గా అందుకు సహస్ర సోదరుడు అంగీకరించలేదు. దీంతో ఇక్కడే ఆ మైనర్ బాలుడి ఈగో దెబ్బతింది. ఎలాగైనా ఆ బ్యాట్ ను కొట్టేయాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. వారి అపార్ట్‌మెంట్ల మధ్య కేవలం 2 అడుగుల దూరం మాత్రమే ఉండటంతో రెండుసార్లు గోడ దూకి వెళ్లి ఇళ్లంతా పరిశీలించాడు. ఎవరూ  ఇంట్లో ఉంటున్నారు. ఎప్పుడు వెళ్తున్నారు అనే విషయాలు గమనించాడు. దీనికి తోడు ఓటీటీలో క్రైమ్‌ వెబ్‌సిరీస్‌లు, యూట్యూబ్‌లో సీఐడీ సీరియల్స్‌ చూసిన అనుభవంతో దొంగతనం ఎలా చేయాలి, దొరికిపోతే ఎలా తప్పించుకోవాలో పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నాడు.     ఎవరైనా అడ్డొస్తే భయపెట్టాలని వంటగదిలోని కత్తి తీసుకొని బయలుదేరాడు.

కానీ, ఇంట్లో ఎవరూ ఉండరనకుంటే సహస్ర కనిపించడంతో నిందితుడు కాసేపు ఆలోచించాడు. ఆమె టీవీ చూస్తుండటంతో మెల్లిగా వెళ్లి బ్యాట్‌ తీసుకొని వెళ్లాలని ప్లాన్ వేశాడు. బ్యాట్ తీసుకుని వెళ్తుండగా ఈలోపు బాలిక గమనించి దొంగదొంగ అంటూ కేకలు వేస్తూ.. ఇంటి గుమ్మం వద్ద నిందితుడిచొక్కా పట్టుకొని వెనక్కి లాగింది.  మీ డాడీకి చెబుతానంటూ బెదిరించింది. దీంతో భయపడిన నిందితుడు బాలికపైన కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు. మెడపై తీవ్రగాయం కావటంతో బాలిక కింద పడిపోయింది. బాలుడు కత్తిని అక్కడే నీళ్లతో కడుక్కొని, బ్యాట్‌ తీసుకొని తన ఇంటికి వచ్చాడు. 

Also Read:క్రికెట్‌ కిట్‌ కోసమే దొంగతనం చేసిన విద్యార్థి.. కూకట్‌పల్లి మర్డర్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు

విచిత్రంగా ప్రవర్తించాడు

బాలికను హత్య  చేసిన అనంతరం బాలుడు చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. ప్రతిరోజు ఎన్నోసార్లు మందలిస్తే తప్ప స్నానం చేయని తన కొడుకు. బాలిక హత్య జరిగిన రోజు ఉదయం 10:30కే స్నానం చేయడంతో తాను ఆశ్చర్యపోయానని బాలుడి తల్లి పోలీసులకు వెల్లడించారు.అప్పుడే తనలో అనుమానం మొదలైందని వెల్లడించింది.అంతేకాకుండా హత్య జరిగిన రోజు తన కొడుకు టెన్షన్ గా ఉండటాన్ని తాను గమనించానని పోలీసులకు చెప్పింది. దీంతో  రెండు రోజులపాటు కొడుకు కదలికలపై కన్నేసనని తెలిపింది. ఘటనాస్థలికి పోలీసులు వచ్చినప్పుడల్లా అక్కడ జరిగేది తెలుసుకొని రావడం.. తన ఇంట్లో వాళ్లనూ ఆ వివరాలు అడుగుతుండటంతో మరింత అనుమానం పెరిగిందంది. ఎందుకురా ఇలా ఆ వివరాలన్నీ అడుగుతున్నావ్.. ఆ పిల్లను నువ్వేమైనా చంపావా? అని తాను గట్టిగా ప్రశ్నిస్తే 'అమ్మతోడమ్మ.. నేనేమీ చేయలేదు. ఎందుకు అనుమానిస్తున్నావ్.. నువ్వే నన్ను పోలీసులకు పట్టించేలా ఉన్నావ్' అంటూ తన కొడుకు బెదిరిపోయినట్లు మాట్లాడాడని పోలీసులకు చెప్పింది. తన కొడుకు ఇటీవల సెల్ ఫోన్ కొన్నాడని, ఇంట్లో వాళ్లు డబ్బు ఇవ్వకుండా ఎలా సెల్ ఫోన్ కొన్నావని అడిగితే నీకెందుకు అని  నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని,  ఆ రోజే నిలదీసి ఉంటే ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదని వాపోయింది.

Advertisment
తాజా కథనాలు