America-Pakistan: అమెరికా-బిన్ లాడెన్- పాక్..గతం మర్చిపోయారు...జైశంకర్ కీలక వ్యాఖ్యలు

అమెరికా పాకిస్తాన్ తో తనకున్న గత చరిత్రను మర్చిపోయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆ దేశంలో దోస్తీ చేస్తోంది. కావాలని భారత్ ను రెచ్చగొట్టేందుకే అమెరికా పాక్ తో స్నేహం చేస్తోందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
External minister Jai shankar says operation sindoor has not stopped

External minister Jai shankar says operation sindoor has not stopped

భారత్ తో గొడవ పెట్టుకున్న అమెరికా పాకిస్తాన్ తో మాత్రం దోస్తీ చేస్తోంది. తరుచూ ఇరుదేశాధికారులు కలుస్తూ చర్చలు చేస్తున్నారు. దీని పై భారత విదేశాంగశాఖ మంత్రి జైశకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా గతం మర్చిపోయి ప్రవర్తిస్తోందని విమర్శించారు.ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో..అమెరికా, పాకిస్తాన్ లకు గత చరిత్ర ఉన్న విషయం మర్చిపోకూడదని గుర్తు చేశారు. ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చడానికి అమెరికా సైనయం అబోటాబాద్ లో చేసి ఆపరేషన్ గురించి మాట్లాడారు. 

గతం మర్చిపోయారు..

వాళ్ళే కొట్టుకుంటారు...వాళ్ళే మళ్ళీ కలిసి పోతారు. ఇద్దరిదీ గొప్ప చరిత్రంటూ జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతాన్ని విస్మరించిన చరిత్ర వారిదే..ఇలాంటివి చూడ్డం కొత్తేమీ కాదు అని జై శంకర్ అన్నారు. ఇదే అమెరికా సైన్యం పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో ఎవర్ని చంపిందో అందరికీ తెలిసిందేనన్నారు. దాంతో పాటూ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై సెప్టెంబర్‌ 11నాటి దాడికి సూత్రధారి బిన్‌ లాడెన్‌ను అమెరికా మట్టుపెట్టిన విషయం కూడా పరోక్షంగా మాట్లాడారు.  కానీ ప్రస్తుతం ఆ రెండూ దేశాలూ అవకాశ వాద రాజకీయాన్ని చేస్తున్నాయంటూ విమర్శించారు.  అమెరికా కావాలనే ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తోందని అన్నారు. భారత్ ఇవన్నీ గమనిస్తోందని..ఇలాంటి సమయంలో ఏలాంటి ముఖ్యమైన అంశాల మీద దృష్టి సారించాలో మన దేశానికి బాగా తెలుసని జైశంకర్ స్పష్టం చేశారు. 

మీకు నచ్చకపోతే..మీరు కొనుక్కోవద్దు..

అలాగే భారత్ పై అమెరికా విధించిన సుంకాలపై కూడా జైశంకర్ తీవ్రంగా విమర్శించారు. భారత్ , రష్యాల నుంచి చమురు, ఇతర వస్తువులు కొనుగోలు చేయమని ఎవరూ బలవంతం చేయలేదని...మీకు ఇష్టం లేకపోతే కొనుక్కోవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అమెరికా మాత్రం తన కిష్టమైన చోట, తనకు అనుకూలంగా ఉన్న వారితో వ్యాపారం చేస్తుంది..కానీ మిగతా వారి మీద ఆంక్షలు పెడుతోందని విరుచుకుపడ్డారు. వాణిజ్యం, రైతుల ప్రయోజనాల పరిరక్షణ మీ భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ చెప్పారు. ఎవరైనా మాతో విభేదిస్తే, దయచేసి రైతుల ప్రయోజనాలను కాపాడటానికి మీరు సిద్ధంగా లేరని భారత ప్రజలకు చెప్పండి అన్నారు. 

Also Read: Trump Hand Patch: ట్రంప్ చేతి మీద పెద్దవుతున్న మచ్చ..అసలేమైందంటూ చర్చ

Advertisment
తాజా కథనాలు