Mudra Society : ఉద్యోగాల పేరుతో రూ.140 కోట్లు వసూలు.. ముద్ర చైర్మన్‌ అరెస్ట్‌

ముద్ర సొసైటీ ఛైర్మన్‌ తిప్పనేని రామదాసప్పను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రైతులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు, అధిక వడ్డీల పేరుతో రూ.140 కోట్లు వసూలు చేసిన కేసులో  రామదాసప్పతో పాటు ఆయన కుమారుడు సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

New Update
Mudra chairman arrested

Mudra chairman arrested

ముద్ర అగ్రికల్చర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీస్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఛైర్మన్‌ తిప్పనేని రామదాసప్పను తెలంగాణ సీఐడీ అధికారులు అమరావతిలో అరెస్టు చేశారు. రైతులు, నిరుద్యోగులు,రోజువారీ కూలీలను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు, అధిక వడ్డీల పేరుతో 2 మంది బాధితుల నుంచి రూ.140 కోట్లు వసూలు చేసిన కేసులో  రామదాసప్పతో పాటు ఆయన కుమారుడు  తిప్పేనేని సాయి కిరణ్‌ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.

సీఐడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2 వేల మార్కెటింగ్‌ మేనేజర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిందితులు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఆ ప్రకటనలు చూసిన పలువురు నిరుద్యోగులు రెండు రాష్ర్టాలకు చెందిన పలువురు బాధితులు వారిని సంప్రదించారు. వారి బలహీనతను అసరా చేసుకున్న నిందితలు వారి వద్ద పెద్ద మొత్తాల్లో నగదు వసూలు చేశారు. అనంతరం వారికి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పి రైతుల నుంచి పెట్టుబడులకు ఉసికొల్పారు. వారినుంచి పెట్టుబడులు తేకుంటే మీ జీతం నుంచి తీసుకుంటానని, సర్టిపికెట్లు ఇవ్వనని వేధించాడు. ఈ విషయమై తెలంగాణ, ఏపీలలో పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కాగాఈ విషయమై తీగలాగితే పెద్ద డొంక కదిలింది. ఉద్యోగాలు, అధిక వడ్డీల పేరుతో కోట్లు కొల్లగొట్టినట్లు తేలడంతో కేసును సీఐడీకి అప్పగించారు. విచారణ జరిపిన సీఐడీ ఇద్దరినీ అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌లోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

ముద్ర బ్యాంక్ పేరుతో మోసం

కేంద్రప్రభుత్వ ప్రధాన మంత్రి ముద్ర యోజన పేరుతో రామదాసప్ప నాయుడు సహకార సంఘాన్ని స్థాపించాడు. ఇది ప్రభుత్వ సంస్థ అని నమ్మించాడు. ఈ సంఘంలో పెట్టుబడి పెడితే  డిపాజిట్లపై అధిక వడ్డీని ఇస్తానని, సభ్యులుగా చేరిన వారికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తానని హామీ ఇచ్చాడు. సొసైటీని త్వరలో ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకుగా మారుస్తామని కూడా అతను చెప్పాడు. ఈ హామీలు, ముఖ్యంగా వార్తపత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లో  2,000 'ప్రభుత్వ మార్కెటింగ్ సూపర్‌వైజర్' ఉద్యోగాలను ఇస్తామని మభ్య పెట్టాడు. దీనికోసం1,600 మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. ఆ సమయంలో వారి ఒరిజనల్‌ సర్టిఫికెట్లను కూడా తీసుకున్నారు.బాధితులను వాటా మూలధనం , పెట్టుబడి బాండ్లను కొనుగోలు చేసే నెపంతో డబ్బు డిపాజిట్ చేయమని కోరారు.

ఇది కూడా చూడండి: హిందుపురంలో భారీ చోరీ.. ఒక్కరోజు సెలవుకే బ్యాంక్‌ మొత్తం ఖాళీ చేసిన దొంగలు!

ఇక రైతులు, చిన్నవ్యాపారుల నుంచి డిపాజిట్లు సేకరించాలని మార్కెటింగ్ సూపర్‌వైజర్లుగా నియమించబడిన ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. డిపాజిట్ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైన ఫలితంగా ఉద్యోగుల జీతాల నుండి కోతలు విధించారు. అయితే ఉద్యోగం నచ్చక రాజీనామా చేసిన వారికి వారి సర్టిఫికెట్లు, రిటర్న్‌లను ఇవ్వడానికి నిరాకరించారు. కాగా ప్రజల నుండి వసూలు చేసిన పెద్ద మొత్తాలను ఆంధ్రప్రదేశ్‌లోని APIIC లిమిటెడ్ ద్వారా పారిశ్రామిక ప్లాట్లను కొనుగోలు చేయడానికి మళ్లించారని CID దర్యాప్తులో తేలింది. మోసపూరిత సొసైటీ సుమారు 330 శాఖలను తెరిచి 2,000 మందికి పైగా బాధితులను మోసం చేసిందని భావిస్తున్నారు.

 కాగా బాధితుల ఫిర్యాదుతో  తెలంగాణ అంతటా నల్లకుంట, కాచిగూడ, గంభీరావుపేట, రామాయంపేట, దుబ్బాక, వేములవాడ, అచ్చంపేట, ఆత్మకూర్ సహా వివిధ పోలీస్ స్టేషన్లలో నిందితులపై కేసులు నమోదయ్యాయి.  ఐపీసీ సెక్షన్లు 406 (నేరపూరిత నమ్మక ద్రోహం), 420 (మోసం), 506 (నేరపూరిత బెదిరింపు), 409 (ప్రభుత్వ ఉద్యోగి లేదా బ్యాంకర్ ద్వారా నేరపూరిత నమ్మక ద్రోహం), మరియు తెలంగాణ ఆర్థిక సంస్థల డిపాజిట్ల రక్షణ (PDFE) చట్టం, 1999 లోని సంబంధిత నిబంధనల కింద నమోదు చేశారు. కాగా. సేకరించిన నిధులను ఎక్కడికి తరలించారు. ఇతర లబ్ధిదారులు ఎవరు? అనే కోణంలో సీఐడీ దర్యాప్తు జరుపుతోంది. 

Also Read : విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. ఆగస్టులో 10 రోజులు సెలవులు

arrest | scam | mudra-yojana-scheme | mudra-loan | pm-mudra-yojana

Advertisment
తాజా కథనాలు