Wine in Tetra Pak : రూ. 105కే క్వార్టర్ మద్యం.... ఇక నుంచి వాటిల్లోనూ అమ్మకాలు..!!

రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు అంచనాలకు మించి సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌ చెప్పేందుకు ఎక్సైజ్ శాఖ కొత్త ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. తక్కువ ధరలకే టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి తెచ్చేలా రంగం సిద్దమైంది.

New Update
Wine in Tetra Pak

Wine in Tetra Pak

Wine in Tetra Pak : రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు అంచనాలకు మించి సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌ చెప్పేందుకు ఎక్సైజ్ శాఖ కొత్త ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది.తక్కువ ధరలకే మద్యం అందు బాటు లోకి తెచ్చేలా రంగం సిద్దమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజనాను మరింత పెంచుకునేందుకు ప్రభుత్వాలు కొత్త ప్రతిపాదనలు తీసుకువస్తున్నాయి. కొత్త ఆలోచనలతో అమ్మకాలను పెంచుకునేందుకు ఎక్సైజ్‌ శాఖ సిద్ధమైంది. అందులో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్లకు అదనంగా కొత్త బ్రాండ్లను పరిచయం చేస్తోంది. దీంతో, పాటుగా అమ్మకాల్లో మార్పులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఫలితంగా ధరలు తగ్గనున్నాయి.

Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!

 తాజాగా ఎక్సైజ్ శాఖ కర్ణాటక తరహాలో రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం  అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఫ్రూట్‌ జ్యూస్‌ తరహాలో మద్యం ప్యాకెట్లను జేబులో పెట్టుకుని తీసుకెళ్లేలా 60 ఎంఎల్‌, 90 ఎంఎల్‌, 180 ఎంఎల్‌ల ప్యాకెట్లను తయారు చేసి అమ్మడానికి సిద్ధం చేస్తున్నారు. సీసలతో పోలిస్తే ప్యాకెట్ల తయారీకి ధర తక్కువ ఉండడంతో ప్యాకెట్ల తయారీకే ఎక్సైజ్‌శాఖ మొగ్గు చూపుతుంది.

Also Read: ‘టీం శివంగి’.. రాష్ట్రంలో తొలిసారి రంగంలోకి మహిళా కమాండోల బృందం!


దీంతో సీసాలో దొరుకుతున్న మద్యం కంటే.. టెట్రా ప్యాకెట్లలో తక్కువ ధరకు లభించనుంది. రాష్ట్రంలో ఇప్పుడు క్వార్టర్‌ చీఫ్‌ లిక్కర్‌ ధర రూ.120గా ఉంది. అదే మద్యం టెట్రా ప్యాకెట్లలోకి మారితే రూ.100లకు లభించే అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలను ఎక్సైజ్‌ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలు జరగనున్నాయి.

Also Read: TS: తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు..సీఎం రేవంత్ ఒప్పందాలు

రాష్ట్రంలో 2620 వైన్‌ షాపులు, 1117 వరకు బార్లున్నాయి. వీటికి దేశ విదేశాలకు చెందిన 55 కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతుంది. కర్ణాటకలో మెక్‌డొవెల్స్‌ నంబర్‌ వన్‌ అనే కంపెనీ 90శాతం టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలు జరుపుతోంది. అదే విధానాన్ని రాష్ట్రంలో విక్రయించడానికి ముందుకొచ్చింది. రూ 105 కే క్వార్టర్ ప్రస్తుతం సరఫరా చేస్తున్న క్వార్టర్‌ బాటిల్స్‌ స్థానంలో టెట్రా ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని ... దీని వల్ల ఖర్చు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి, వినియోగదారుడు, కంపెనీకు కలిగే ప్రయోజనాల గురించి ఆ శాఖ అధికారులతో చర్చించారు. 

Also Read: తెలంగాణ రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ పంపిణీ? ఉడికించి వీడియో పోస్ట్ చేసిన లబ్దిదారుడు!

కర్ణాటకలో 90 ఎంఎల్‌, 180 ఎంఎల్‌ ప్యాకెట్లు విక్రయిస్తుండగా, తెలంగాణలో వీటితోపాటు 60 ఎంఎల్‌ ప్యాకెట్లు కూడా తేవాలని ప్రతిపాదించారు. సీసా మద్యంతో పోల్చినప్పుడు టెట్రా ప్యాకెట్‌ మద్యం మందుబాబులకు రూ.10 నుంచి రూ.15 తక్కువ ధరకే లభిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం క్వార్టర్‌ చీప్‌ లిక్కర్‌ ధర రూ.120 ఉన్నది. ఇదే మద్యం టెట్రా ప్యాక్‌లోకి మారితే రూ.105కే లభిస్తుందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన మందుబాబులకు ఒక క్వార్టర్‌ మద్యం మీద రూ.15 మేర మిగులుతుందని వివరిస్తున్నారు. ఈ టెట్రా ప్యాకెట్ అమ్మకాల పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Also Read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు