/rtv/media/media_files/2025/10/22/shocking-facts-in-khammam-womans-suicide-case-2025-10-22-16-14-38.jpg)
Shocking facts in Khammam woman's suicide case
Big breaking : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండాకు చెందిన బోడ సుశీల (28) ఆత్మహత్య విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె ఇంటి ఎదురుగా ఉండే రౌడీ షీటర్ ధరావత్ వినయ్ ఆమెను కొంత కాలంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెపై కన్నేసిన వినయ్ తరచూ తన కోరిక తీర్చాలని బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పత్తి తీసేందుకు సుశీల మరో మహిళతో కలిసి సోమవారం కొణిజర్ల మండలం అమ్మపాలెం వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమెను అనుచరిస్తూ వెళ్లిన వినయ్ సుశీల దగ్గరకు వెళ్లి తన కోరిక తీర్చాలని వేధింపులకు దిగినట్లు చెబుతున్నారు. అయితే సుశీల ప్రతిఘటించడంతో ఆమెపై దాడికి పాల్పడ్డ వినయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు చెబుతున్నారు.
కానీ, సుశీలపై దాడి చేసిన ధరావత్ వినయ్ తన కోరిక తీర్చాలంటూ వివాహితను బలవంతంగా..కారులో ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తిరిగి తీసుకొచ్చి అమ్మపాలెంలో వదిలేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన సుశీల ఇంటికి వచ్చిన తర్వాత ఉరేసుకుంది. అయితే వినయ్ ఆమెను బలవంతంగా తీసుకెళ్లిన సమయంలో ఆమెపై అత్యాచారం జరిగినట్లు వారు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే సుశీల మృతిపై ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుశీల ఒంటిపై గాయాలు ఉన్నాయని, శవపరీక్షలో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని, ఉరేసుకుని మరణించిందని మాత్రమే వైద్యులు చెబుతున్నారని ఆరోపించారు. ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆందోళనకు దిగారు. సుశీలది సహజ మరణంగా వైద్యులు తేల్చారంటూ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సుశీల భర్త, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో సీఐ ఉస్మాన్‌షరీఫ్, ఎస్‌ఐలు వెళ్లి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Also Read: Prabhas Fauji: "మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932".. ప్రభాస్ ప్రీ-లుక్ పోస్టర్ అదిరిపోయింది👌