Bird Flu: కరోనా కంటే డేంజరెస్‌ బర్డ్‌ ఫ్లూ..కొత్త వేరియంట్‌ గుర్తింపు

బర్డ్‌ ఫ్లూను ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌గా పిలుస్తారు. కరోనా కంటే డేంజరెస్‌ బర్డ్‌ ఫ్లూ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తిని పరీక్షించిన వైద్యులు హెచ్5ఎన్1 వైరస్ డీ1.1 జన్యురూపానికి చెందినదని గుర్తించారు.

New Update
Australia: భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు బర్డ్‌ఫ్లూ కేసు-డబ్ల్యూహెచ్‌వో

Bird Flu

Bird Flu: కరోనా మానవాళిని వణికించింది. కొత్త కొత్త వేరియంట్లతో విరుచుకుపడింది. ఎంతో మంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం దీని నుంచి కోలుకుంటుండగా మరో పిడుగులాంటి వార్త భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా కంటే డేంజరెస్‌ బర్డ్‌ ఫ్లూ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని లూసియానాలో ఒక రోగికి ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్ ఫ్లూ) తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు. ఇది అమెరికాలో గుర్తించిన తొలి తీవ్రమైన కేసు అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్-సీడీసీ ప్రకటించింది. ఈ కేసుతో కలిపి అమెరికాలో బర్డ్ ఫ్లూ సోకిన వారి సంఖ్య 2024 సంవత్సరంలో 61కి చేరింది.

ఇది కూడా చదవండి: చలికాలంలో ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోతే ఏమవుతుంది?

జన్యురూపానికి చెందినదని..

ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తిని పరీక్షించిన వైద్యులు హెచ్5ఎన్1 వైరస్ డీ1.1 జన్యురూపానికి చెందినదని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇక ఈ H5N1 వైరస్ డీ1.1 రకం జన్యురూపం ఇటీవల అమెరికాలోని అడవి పక్షులు, ఫౌల్ట్రీ ఫామ్‌లలో కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. వాషింగ్టన్ రాష్ట్రంతో పాటు కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో మానవ కేసుల్లో ఈ జన్యురూపాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. అయితే బర్డ్ ఫ్లూ మానవుడి నుంచి మానవుడికి వ్యాపించడాన్ని సూచించే తగిన ఆధారాలు ఇప్పటివరకు లభ్యం కాలేదని అధికారులు చెప్పడం కొంత ఊరట ఇచ్చే అంశం. బర్డ్‌ ఫ్లూను సాధారణంగా ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌గా పిలుస్తారు. 

ఇది కూడా చదవండి: రోజులో ఎన్ని వాల్‌నట్‌లు తినాలి?..ప్రయోజనమేంటి?

ఈ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా సాధారణంగా పక్షులు, కోళ్లకు వస్తుంది. ఇన్‌ఫ్లూయంజా టైప్‌-ఏలో 12 కుపైగా వైరస్‌లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో హెచ్5ఎన్8, హెచ్5ఎన్1 రకాలకు చెందిన బర్డ్‌ ఫ్లూ మాత్రం పౌల్ట్రీ ఉత్పత్తులైన కోళ్లు, బాతులతో పాటు టర్కీ కోళ్లకు వస్తాయని అంటున్నారు. పక్షుల్లో ప్రాణాంతకంగా ఉన్న ఈ H5N1 వేరియంట్‌ను డబ్ల్యూహెచ్‌వో 1997లో తొలిసారి గుర్తించింది. ఇక భారత్‌లో మాత్రం 2006లో ఈ బర్డ్ ఫ్లూ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో తొలిసారి మనుషుల్లో గుర్తించారు. భారత్‌లో ప్రతి సంవత్సరం వచ్చే విదేశీ వలస పక్షుల ద్వారా బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇది కూడా చదవండి: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు