Khammam: ఎలుకల నిలయాలుగా గురుకులాలు.. విద్యార్థిని పరిస్థితి విషమం

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. రాత్రి నిద్రించే సమయంలో ఎలుకలు కరవడంతో ఓ విద్యార్థిని గాయపడింది. ఎలుకల దాడిలో నరాలు చచ్చుబడి విద్యార్థిని స్పర్శ కోల్పోయిందని భవాని కీర్తి తల్లి ఆరోపిస్తుంది.

New Update
khammam

TG News

TG News: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకులంలో దారుణ ఘటన జరిగింది. బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. సోమవారం రాత్రి నిద్రించే సమయంలో ఎలుకలు కరవడంతో ఓ విద్యార్థిని గాయపడింది. ఈ విషయాన్ని బాధిత విద్యార్థినులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే హాస్టల్ సిబ్బంది ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. బీసీ గురుకులంలో  ఎలుకల దాడిలో గాయపడిన విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలో ఉంది. గతంలో పలుమార్లు ఎలుకలు కొరకిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గోప్యంగా ఉంచి  పాఠశాల సిబ్బంది వ్యాక్సిన్లు అందించారు. 

 స్పర్శ కోల్పోయిందని భవానికీర్తి:

ఇటీవల మరోమారు పదో తరగతి విద్యార్థిని సముద్రాల భవానీ కీర్తిని (15)  ఎలుక కొరికింది. ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన కీర్తి వారం రోజుల క్రితం కాళ్లు, చేతులు లాగుతున్నాయని తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో తల్లి హాస్టల్‌కు వచ్చి విద్యార్థినిని తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించింది. నరాలు చచ్చుబడి విద్యార్థిని స్పర్శ కోల్పోయిందని భవాని కీర్తి తల్లి ఆరోపిస్తుంది. గురుకులంలో రెండు సంవత్సరాలుగా నాలుగుసార్లు ఎలుకలు కరవడమే ఇందుకు కారణంగా తల్లి ఆరోపించింది. ఆస్పత్రిలో చేర్పించి విద్యార్థినికి  కుటుంబసభ్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషయంలో తమకేం సంబంధంలేదని సిబ్బంది చెబుతున్నారని, కుటుంబసభ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని అంటున్నారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థిని తల్లి డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో గురుకుల సిబ్బంది గోప్యత పాటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇది కూడా చదవండి: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపే ఆర్జిత సేవా టికెట్లు విడుదల

ఓ వైపు ప్రభుత్వ అధికారులు గురుకులంలో విద్యార్థుల వసతి గదులను, వంటశాలను పరిశీలించి నాణ్యమైన ఆహారం పెట్టాలని చెబుతూనే ఉన్నా..కొందరు సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇటీవల మేడ్చల్‌ జిల్లా కీసరలోని జ్యోతిబా ఫులే సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో కూడా ఐదుగురు విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. ఉదయం విద్యార్థినులను కీసరలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకు రావడంతో విషయం బయటికి వచ్చింది. కాంగ్రెస్‌ పాలనలో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందంటూ హరీష్‌రావు ఆరోపించారు. ఎలుకలు, కుక్కలు, పాములు కరిచినా పట్టించుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటూ విమర్శలు గుప్పించారు. గురుకుల బాట డొల్లతనం 24 గంటలు గడవక ముందే బయటపడిందంటూ మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: బాబూ పక్కకెళ్లి ఆడుకోమ్మా.. గజరాజు మర్యాద చూడండి

ఇది కూడా చదవండి: విష్ణు తప్పేం లేదు, చేసిందంతా మనోజే .. మోహన్ బాబు భార్య సంచలన లేఖ

ఇది కూడా చూడండి: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు